దొంగలకు షాక్: పెద్ద కత్తితో పరుగెత్తించాడు(వీడియో)
అమెరికా: ఓ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగలకు విచిత్రకరమైన పరిస్థితి ఎదురైంది. దొంగతనం చేసేందుకు ఓ మోస్తారుగా ఉన్న కత్తులతో వచ్చిన దోపిడీ దొంగలు.. షాపు యజమానిని బెదిరింపులకు గురిచేశారు. ఆ తర్వాత షాపు దోచుకునే పనిలో పడ్డారు. అయితే ఆ షాపు యజమాని దొంగలు తెచ్చిన కత్తి కంటే పెద్ద కత్తి(తల్వార్) పట్టుకుని వచ్చాడు.
దీంతో ఒక్కసారిగా అవక్కైన ఆ దొంగలు ఏంచేయాలో తెలియక పరుగు లంకించారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో పిట్స్‌బర్గ్ నగరంలో గత శుక్రవారం చోటు చేసుకుంది. ఆ దొంగలను ఎదుర్కొన్న సూపర్ మార్కెట్ యజమాని జెవద్ హయిత్.
వివరాల్లోకి వెళితే.. రోజులాగే గత శుక్రవారం అర్ధరాత్రి షాపు మూసేసి ఇంటికెళ్లే సమయానికి.. ఇద్దరు యువకులు షాపులో చొరబడ్డారు. వారి వద్ద ఉన్న కత్తితో జెవద్‌ను బెదిరించారు.
అయితే జెవద్ ఏమాత్రం భయపడకుండా.. తన దగ్గర ఉన్న పెద్ద కత్తిని బయటకు తీసి దొంగల వెంట పడ్డాడు. అనుకోని పరిణామానికి కంగు తిన్న దొంగలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు.
కాగా, ఈ సంఘటనంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దొంగలు ముఖం కనబడకుండా గుడ్డలు కట్టుకున్నారు. కాగా, ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications