Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ దేశంలో ప్రజలు పన్నులు కట్టనవసరం లేదు.. విద్య, వైద్యం పూర్తిగా ఉచితం.. ఎక్కడో తెలుసా?

నాలుగవ ధనిక దేశంగా బ్రూనై

కరోనా మహమ్మారి అయినా ఉక్రెయిన్-రష్యా యుద్ధమైనా.. దేనికి కూడా తొణకని బెణకని ఆర్థిక వ్యవస్థ ఆసియాలోని ఈ చిన్నదేశానిది.

ప్రపంచంలో చాలా దేశాలు కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో బాగా ప్రభావితమయ్యాయి. వాటి రుణాలు భారీగా పెరిగిపోయాయి. కానీ, బ్రూనైలో మాత్రం పరిస్థితులన్ని అదుపులో ఉన్నాయి.

కరోనా మహమ్మారిని తట్టుకునేందుకు చాలా దేశాలు తమ వ్యయాలు భారీగా పెంచాయి. ఎందుకంటే ఈ అనుకోని ఖర్చులను తట్టుకునేందుకు ఆ దేశాల వద్ద ముందస్తు బడ్జెట్‌లు లేవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ప్రపంచవ్యాప్తంగా ధరలు భారీగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి.

ఇన్ని సవాళ్లున్నప్పటికీ, బ్రూనైలో ఎలాంటి సమస్య లేదు. ఆ దేశ జీడీపీలో రుణం కేవలం 1.9 శాతమే ఉంది. ప్రపంచంలో అత్యంత తక్కువ రుణమున్న దేశం బ్రూనైదే.

తక్కువ రుణం-జీడీపీ రేషియో ఉండటమనేది ప్రతిసారి ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సూచించదు.

చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో రుణం-జీడీపీ రేషియో తక్కువగానే ఉంటుంది. అంటే వాటి రుణం, సంపద సృష్టి రెండూ తక్కువగానే ఉంటాయి.

అయితే, దీంతో బ్రూనైకి సంబంధం లేదు.

ఎందుకంటే, ఈ చిన్న దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన జీవన ప్రమాణాలను కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది. దీనంతటికీ కారణం ఆ దేశంలో లభిస్తోన్న ఆయిల్, గ్యాస్ నిల్వలే.

ప్రపంచంలో నాలుగవ ధనిక దేశంగా బ్రూనై నిలుస్తోంది.

నాలుగవ ధనిక దేశంగా బ్రూనై

పెట్రో దేశం, గణనీయమైన సంపద

''బ్రూనై పెట్రో నిల్వలు పుష్కలంగా ఉన్న దేశం. జీడీపీలో క్రూడాయిల్, సహజ వాయువుల ఉత్పత్తి సుమారు 90 శాతంగా ఉంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కి చెందిన స్కూల్ ఆఫ్ ఓరియెంటల్, ఆఫ్రికన్ స్టడీస్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉల్‌రిచ్ వోల్జ్ అన్నారు.

2017 చివరి నాటికి బ్రూనై దేశంలో 1,100 మిలియన్ బ్యారళ్ల ఆయిల్ నిల్వలున్నాయి. అలాగే గ్యాస్ నిల్వలు 2.6 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉన్నాయి.

ఆగ్నేయ ఆసియాలోని బ్రూనియో ద్వీపంలో ఉత్తర తీరంలో ఈ దేశం ఉంది. మలేసియా, ఇండోనేసియా దేశాల సరిహద్దులను ఇది పంచుకుంటోంది.

ఈ దేశాన్ని పాలిస్తోన్న సుల్తాన్ హసానల్ బోల్కియో, ఆయన రాయల్ కుటుంబ సభ్యుల వద్ద అపారమైన సంపద ఉంది.

ఈ దేశంలో ప్రజలు ఆదాయపు పన్నులను చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వమే యూనివర్సిటీ వరకు ఉచితంగా విద్యను అందిస్తోంది. వైద్య సౌకర్యాలు కూడా ఉచితమే.

దీని రాజధాని బందర్ సెరీ బెగవాన్ చాలా సురక్షితంగా, శుభ్రంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించిన చాలా మంది పర్యాటకులు చెప్పారు.

ప్రజల్లో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న సుల్తాన్, పలు ప్రభుత్వ పథకాల కింద ఆ దేశంలోని ప్రజలకు తరచూ భూమి పట్టాలను, ఇళ్ల స్థలాలను అందిస్తుంటారు.

జనాభా పరంగా ఇది చాలా చిన్న దేశం. ఐదు లక్షల మందే ఇక్కడ నివసిస్తున్నారు. ఈ జనాభా కూడా దేశంలోని కొద్ది ప్రాంతంలోనే స్థిరపడింది.

బ్రూనై రుణం ఇంత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, ఆ దేశం పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఆర్జించిన ఆదాయమే.

పుష్కలమైన ఆయిల్, గ్యాస్ నిల్వలతో పెద్ద మొత్తంలో ఆ దేశం నగదు నిల్వలను కలిగి ఉంది. ఈ నగదుతోనే ఆ దేశం తనకున్న ద్రవ్య, వాణిజ్య లోట్లను భర్తీ చేసుకుంటూ.. అప్పును తక్కువగా తీసుకుంటోంది.

బ్రూనై చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. ఆసియాలో ఆయిల్, గ్యాస్ సరఫరా చేస్తోన్న దేశాలో ఇది చాలా ముఖ్యమైంది.

ఆయిల్, గ్యాస్ ఎగుమతులతో ఆ దేశంలో కరెంట్ అకౌంట్ మిగులు ఉందని ప్రొఫెసర్ వోల్జ్ అన్నారు. అంటే ఈ దేశం తీసుకునే అప్పుల కంటే కూడా, ఇతర దేశాలకు అందిస్తోన్న రుణాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

ప్రపంచంలో అత్యంత తక్కువ అప్పులు తీసుకున్న ఏకైక దేశంగా బ్రూనై నిలుస్తోంది. బ్రూనైలోని బ్యాంకులు, ప్రభుత్వ ఖజనాలు పూర్తిగా పెట్రోలియం రెవెన్యూలతోనే నిండి ఉన్నాయి.

ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో, బ్రూనై ఇంత నిశ్చితంగా ఉండటానికి ప్రధాన కారణమిదే.

ప్రపంచంలోని ఇతర దేశాలు తమ వ్యాపారాలను నిర్వహించడానికి అప్పులు చేస్తూ ఉంటాయి.

కరోనా మహమ్మారి సమయంలో, చాలా దేశాలు ప్రైవేట్ లెండార్ల నుంచి అప్పులు తీసుకున్నాయి. అంతేకాక, ప్రభుత్వ రెవెన్యూలు పడిపోయి, వ్యయాలు భారీ ఎత్తున పెరిగాయి.

నాలుగవ ధనిక దేశంగా బ్రూనై

బ్రూనై ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకతమేటి?

బ్రూనై ఆర్థిక వ్యవస్థకున్న అనుకూలతలో ఒకటి.. ఆ దేశం చెల్లించాల్సిన మొత్తం తక్కువగా ఉండటంతో పాటు దాన్ని కూడా విదేశీ కరెన్సీలో చెల్లించాల్సినవసరం లేకపోవడం.

మరో మంచి విషయమేమిటంటే.. ప్రభుత్వం తన లాభాలన్నింటిన్ని స్వదేశంలోనే ఉంచుతుంది.

''సమర్థవంతమైన ఆర్థిక విధానమనేది ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది. ఇది ఈ దేశంపై, దేశ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది’’ మూడీస్ ఆర్థిక వేత్త ఎరిక్ ఛియాంగ్ అన్నారు.

బ్రూనై కరెంట్ అకౌంట్ చాలా వరకు మిగులులోనే ఉంటుంది. ఇది విదేశీ రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది. ఈ దేశంలో వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి.

అయితే, ఇదంతా చూసి బ్రూనైలో అంత బాగున్నట్లు చెప్పలేం.

ఎందుకంటే, ప్రపంచ దేశాలు ప్రస్తుతం కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం పెట్రో ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలనుకుంటున్నాయి.

దీంతో పెట్రో ఉత్పత్తుల ఆదాయాలపైనే ఎక్కువగా ఆధారపడ్డ ఈ ఆర్థిక వ్యవస్థ, దాని నుంచి ఇతర ఆదాయ వనరులపై దృష్టిసారించాల్సి ఉంది. పెట్రో ఉత్పత్తులపై ఆధారపడటానికి ముగింపు పలకాల్సి ఉంది.

ఒకే ఉత్పత్తిపై ఆధారపడటం ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే.

''గ్యాస్, ఆయిల్‌పై ఎక్కువగా ఆధారపడటం మారుతోన్న ఈ ప్రపంచంలో ప్రమాదకరమే. ఎందుకంటే ప్రపంచంలో ఇంధన వినియోగం ప్రస్తుతం మారుతోన్న దశలో ఉంది’’ ఐసీఈఎక్స్ విదేశీ వాణిజ్య నిపుణులు అన్నారు.

నాలుగవ ధనిక దేశంగా బ్రూనై

కఠినతరమైన ఇస్లామిక్ చట్టం

బ్రూనై 1888లో బ్రిటీష్ నియంత్రణలో ఉండేది. 1929లో ఈ దేశంలో ఆయిల్ నిల్వల్ని కనుగొన్నారు. ఆ తర్వాత ఈ నిల్వల్ని వెలికితీయడం ప్రారంభించారు.

1962లో ఈ దేశంలో నిరసనలు నెలకొన్నాయి. ఫెడరేషన్‌లో చేరేందుకు ఒప్పుకోని ఒకే ఒక్క మలేషియా దేశం బ్రూనై. దీంతో, బ్రూనై ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

అయితే, ఈ దేశానికి పూర్తి స్వాతంత్య్రం వచ్చింది మాత్రం 1984లోనే. ఈ సమయంలో బ్రిటీషర్లు బ్రూనైను విడిచిపెట్టి వెళ్లారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, సుల్తాన్ హసనాల్ తనకు తానుగా ప్రధాన మంత్రిగా ప్రకటించుకున్నారు. ఆ దేశంలో 'మలయ్ ముస్లిం రాచరిక’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి, అనుసరిస్తున్నారు. ఈ విధానంలో, సుల్తాన్ ఇస్లాం రక్షకుడిగా వ్యవహరిస్తారు.

2014లో తూర్పు ఆసియాలో కఠినతరమైన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తొలి దేశంగా బ్రూనై నిలిచింది.

స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలనే చట్టాన్ని 2019లో ఆయన వెనక్కి తీసుకున్నారు. జార్జ్ క్లూనీ లాంటి సెలబ్రిటీల నుంచి ఒత్తిడి, విమర్శలు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా అమలు చేస్తోన్న ఉరిశిక్షను కూడా అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత దాని అమలుపై మారటోరియం విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+