లైవ్ లో సూసైడ్ : వీక్షించిన పారిస్ జనం

పారిస్ : చనిపోయే ముందు తమ ఆత్మహత్యకు గల కారణాలను రికార్డు చేసి.. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో సెల్ఫీ వీడియో అందుబాటులోకి వచ్చాక ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా పారిస్ లో, ఏకంగా తన ఆత్మహత్యనే లైవ్ టెలికాస్ట్ చేసింది ఓ ఫ్రెంచ్ యువతి. పెరిస్కోప్ అనే యాప్ ద్వారా ఈ చర్యకు పూనుకుంది ఆత్మహత్యకు పాల్పడిన యువతి.

దక్షిణ పారిస్ లోని ఇగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పారిస్ కు చెందిన 19 ఏళ్ల యువతి.. తన ఆత్మహత్యకు గల కారణాలను సెల్ఫీ వీడియో ద్వారా రికార్డు చేసి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. అత్యాచారానికి గురవడం వల్లే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వీడియోలో తెలియజేసింది. అయితే తన ఆత్మహత్యను పెరిస్కోప్ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇప్పుడో సంచలనంగా మారింది.

Periscope used by French teenager to live-stream her own suicide

కాగా.. ఇగ్లీలోని సబర్బన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది యువతి. ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు రికార్డయిన వీడియోలను పరిశీలిస్తున్నారు. లైవ్ ద్వారా యువతి ఆత్మహత్యను వీక్షించిన వ్యక్తుల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పెరిస్కోప్ అనేది ట్విట్టర్ కు అనుసంధానమై ఉండే ఒక యాప్. దీని ద్వారా ట్విట్టర్ ఖాతాలో లైవ్ వీడియోలను వీక్షించే వెసులుబాటు ఉంది. అయితే ఈ వెసులుబాటును ఇలాంటి చర్యల కోసం వినియోగించుకోవడం దురదృష్టకరం అంటున్నారు పలువురు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+