పెరూలో భారీ భూకంపం .. 7 తీవ్రతతో ప్రకంపనాలు ... సునామీ వచ్చే అవకాశం
పెరూ : దక్షిణ అమెరికాలోని పెరూలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. మధ్య పెరూలో తీవ్రత ఎక్కువగా ఉంది. భూ కంప తీవ్రత 7.3గా నమోదైంది. తర్వాత తగ్గుతూ 7కి చేరింది. పెరూకి 11 కిలోమీటర్ల దూరంలో గల అజాంగరో వద్ద కూడా భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నది. భూకంప తీవ్రత ఎక్కువ ఉండటంతో బ్రెజిల్, బొలివియా, చిలీ దేశాలకు ప్రకంపనాలు వ్యాపించినట్టు అమెరికా జియోలాజికల్ అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపంతో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. పెరూలో భూకంపం వచ్చి తర్వాత .. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.

సునామీ వచ్చే అవకాశం
పెరూలో వచ్చిన తీవ్ర భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. భూకంప తీవ్రత తగ్గుతూ ఉండటంతో సునామీ రాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. హవాలి ద్వీపానికి కూడా సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టంచేశారు.

2007లో 8 తీవ్రతతో భూకంపం
ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే .. 2007లో వచ్చిన భూకంపం పెరూను అతలాకుతలం చేసింది. 8 తీవ్రతతో వచ్చిన భూకంపంతో దాదాపు 600 మంది మృతిచెందారు. ఆ నాటి ఘటనను గుర్తుచేసుకొని .. గజ గజ వణికిపోతున్నారు ప్రజలు.

మధ్యప్రదేశ్ లో కూడా భూకంపం
ఇటు మధ్యప్రదేశ్ లో కూడా భూకంపం వచ్చింది. శుక్రవారం 4.6 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని సింగ్రౌలీగా గుర్తించారు. 10 కిలోమీటర్ల మేర ప్రభావం చూపించిందని అధికారులు తెలిపారు. భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications