పెరూలో భారీ భూకంపం: తీవ్రత 7.5గా నమోదు
న్యూఢిల్లీ: దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశమైన పెరూలో మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశంలోని పలు ప్రాంతాలను అరగంట పాటు వణికించింది.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు సంభవించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల ఇంకా తెలియాల్సి ఉంది. భూఉపరితలానికి 602 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది.

పెరూలో సంభవించిన భూకంపం కారణంగా ఆ దేశానికి పొరుగు దేశాలైన బ్రెజిల్, బొలివియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. కాగా భూకంప కేంద్రం భూతలానికి చాలా లోతులో ఉండటం వల్ల నష్టతీవ్రత తక్కువగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
7.5 magnitude earthquake hits Peru, no casualty reported https://t.co/TYGKOlDDy8 pic.twitter.com/fHMNTpgHx7
— CNN-IBN News (@ibnlive) November 25, 2015 #BREAKING Magnitude 7.6 earthquake hit Iberia of #Peru Tuesday evening, @USGS pic.twitter.com/2q6SpsWwsy
— People's Daily,China (@PDChina) November 25, 2015 #Update People in Cuzco, SE of #Peru, were spotted staying on streets after the 7.6-magnitude #PeruEarthquake Tue pic.twitter.com/G7WahQxNxf
— People's Daily,China (@PDChina) November 25, 2015 











Click it and Unblock the Notifications