‘కాల్చొద్దు’ అని చిలుక: సాక్ష్యంగా తీస్కోండని మాజీ భార్య
మిచిగాన్: ఓ వ్యక్తి దారుణ హత్య కేసులో చిలుకను సాక్ష్యంగా అనుమతించాలని అతని మాజీ భార్య కోర్టును కోరుతోందని ఆ కేసు వాదిస్తున్న న్యాయవాది తెలిపారు. అయితే కోర్టు చిలుక పలుకులను సాక్ష్యంగా తీసుకునే అవకాశంపై ఉందో లేదో అనే అంశం సందేహంగా మారిందని చెప్పారు.
నేవగో కౌంటీ ప్రాసిక్యూటర్ రార్ట్ స్ప్రింగ్‌స్టీడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చిలుక పలుకులపై చాలా అనుమానాలున్నాయని, దీన్ని సాక్ష్యంగా తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు. చిలుక ఒకే పదాన్ని పదే పదే అంటోందని చెప్పారు. జడ్జీ కోర్టులో చిలుకను కుడి చేయి లేపమంటే.. అది రెక్క లేపుతుందా? లేక తన కాలును చూపుతుందా? అనే సందేహం వ్యక్తం చేశారు.

మిచిగాన్‌లోని ఎన్‌స్లే టౌన్‌షిప్‌లో నివాసముండే మార్టిన్ దురమ్ అనే వ్యక్తిని 2015, మేలో హత్య గావింపబడ్డారు. కాగా, దుండగుడి దాడిలో అతని భార్య గ్లేన్ దురమ్ తలకు తీవ్ర గాయమైంది. అయితే, ఆమె ప్రస్తుతం కోలుకుంది.
కాగా, మార్టిన్ మాజీ భార్య క్రిస్టినా కెల్లర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. మార్టిన్ పెంచుకుంటున్న చిలుక మార్టిన్ స్వరంతో 'డోంట్ షూట్(కాల్చొద్దు)' అని పలుమార్లు చెప్పిందని తెలిపారు. అయితే, అతడు వినలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications