కొవిడ్-19 వ్యాక్సిన్: చివరి ట్రయల్స్‌లో 95 శాతం సత్ఫలితాలు: ఫైజర్ ఫార్మా ప్రకటన
కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్దిలో ఫ్రంట్ రన్నర్ గా కొనసాగుతోన్న అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ.. మరో గుడ్ న్యూస్ వెల్లడించింది. జర్మనీకి చెందిన బయోన్‌టెక్‌తో కలిసి ఫైజర్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి చివరిదైన ఫేజ్-3 క్లినికల్ ట్రంయల్స్ లో అద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపింది. తుది ప్రయోగాత్మక దశలో తమ వ్యాక్సిన్ 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు బుధవారం ప్రకటన చేసింది.
కరోనా పాజిటివ్‌గా తేలిన 170 మంది రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించామని, వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత 95 శాతం సత్ఫలితాలు కనిపించినట్లుగా ఫైజర్ సంస్థ పేర్కొంది. మరికొద్ది రోజుల్లో.. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ), ఎమర్జన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ)ను సంప్రదించి ఆమోదం కోసం ప్రతిపాదన పంపనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే..
ఫైజర్ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ను అమెరికాలో అత్యవసర కేసులకు వాడాలనే ప్రతిపాదన దాదాపు అంగీకార దశకురాగా, భారత్‌లో మాత్రం దీని వినియోగం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే, ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచే వాతావరణ పరిస్థితులు భారత్‌లో లేవు. ఫైజర్ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలన్న వార్తే ఇందుకు కారణం.
భారత్ మాత్రమే కాదు సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చాలా దేశాలు ప్రస్తుతం -70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్‌ను నిల్వ చేయాలన్న ప్రచారంతో ఫైజర్ వ్యాక్సిన్‌ను కొనాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో ఉన్నాయి. దీనిపై.. నీతి ఆయోగ్ సభ్యులు, కోవిడ్-19పై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

భారత్‌లో ఉన్న జనాభాకు సరిపడా వ్యాక్సిన్ లభించకపోవచ్చని.. అయితే ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రత్యామ్నయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని.. ఫైజర్ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం లభించిన తర్వాత ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications