వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు పెళ్లయిందా, ఐనా నాకు ముద్దు ఇవ్వండి: మహిళతో అధ్యక్షుడు, విమర్శలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

పెదాలపై ముద్దు.. తీవ్ర విమర్శలు

మనీలా: ఫిలిప్పీన్స్‌లో నిరంకుశ అధ్యక్షులు రొడ్రిగో డ్యుటెర్టె పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళను 3వేల మంది సమక్షంలో బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో విమర్శలు వస్తున్నాయి.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆయన పర్యటించారు. ఆదివారం అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న వారిలో ఓ పిలిఫైనో మహిళను వేదిక మీదకు పిలిచారు. ఆమెకు ఓ పుస్తకాన్ని బహూకరించారు. తన పెదాలను ముద్దు పెట్టుకోవాలని అడిగారు.

 Philippines Duterte stirs controversy by kissing woman on lips

మీరు ఒంటరా లేక పెళ్లయిందా, నేను ఇచ్చే పుస్తకం బదులు నా పెదాలను ముద్దాడండి అని రోడ్రిగో అడిగారు. దానికి ఆమె పెళ్లయిందని సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ ముద్దు పెట్టమని అడిగారు. ఆమె మొహమాటపడుతూ ముద్దాడింది.

ఆమె మొహమాటపడుతూ ముద్దు పెట్టుకోవడం చూసి అక్కడున్న వారు అతని తీరుకు నిశ్చేష్టులయ్యారు. అయితే ఆ వెంటనే ఆయన ఇది సరదా కోసం చేసిందని, సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. అయితే ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

English summary
A kiss by Philippine President Rodrigo Duterte on a Filipino woman's lips while on an official visit in South Korea sparked anger and jokes on Monday, as feminists denounced what they called his "perverted way" of taunting his female critics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X