Shocking Video: రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ఫిలిప్పైన్స్ లో రెండు సైనిక విమానాలు ప్రమాదవశాత్తు ఆకాశంలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు పైలట్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఫిలిప్పైన్స్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. సైనిక విమానాలు ట్రైనింగ్ లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం సౌత్ మనీలాలోని ఫెర్నాడో ఎయిర్ బేస్ లో ఎస్ఎఫ్-260 సింగిల్ ప్రొపెల్లర్ ప్లేన్ లు ప్రమాదవశాత్తు ఒకదాన్నొకటి ఢీ కొన్నట్లు పేర్కొంది.
" రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు సేమ్ బేస్ పెరిమీటర్ తో కిందకు పడిపోయాయి. నలుగురు ఎయిర్ ఫోర్స్ పైలట్స్ మృతి చెందారు" అని ఫిలిప్పైన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి కల్నల్ అల్విన్ కాపిన్గి యాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక ఈ ప్రమాదంపై ఫిలిప్పైన్ ఎయిర్ ఫోర్స్ పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఇటీవలి కాలంలో ఫిలిప్పైన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలో భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మే లో ఎస్ఎఫ్-260 మిలిటరీ విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మిలిటరీ ఫైలట్లు మృతి చెందారు. ఈ ఘటన నార్త్ ఫిలిప్పీన్స్ లోని బెంగ్విట్ ప్రావిన్స్ లో జరిగింది.
Philippine Air Force planes FLY DANGEROUSLY CLOSE before COLLIDING MID-AIR — BOTH SPIRAL OUT OF CONTROL & CRASH during TRAINING4 AIR FORCE PILOTS KILLED https://t.co/fgqEdxJNM3
— RT (@RT_com) October 24, 2026
అంతకుముందు కూడా 2023 లో కూడా ఎస్ ఎఫ్-260 టీపీ మార్చెట్టి అనే విమానం కూడా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో కూడా ఇద్దరు పైలట్లు మరణించారు. ఫిలిప్పైన్స్ లో ఈ విమానాలు తరచూ ప్రమాదాలకు గురి కావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ప్రస్తుతం ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఫిలిప్పైన్స్ ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది.

అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలిసే వరకు ఎస్ ఎఫ్-260 విమానాలన్నింటినీ తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ఇటలీ తయారీకి చెందిన ఈ ప్రొపెల్లర్ శిక్షణ విమానాలను దశాబ్దాలుగా అక్కడి సైన్యం వినియోగిస్తోంది. 2017 లో మరావీ నగరంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై జరిపిన వైమానిక దాడుల్లోనూ వీటిని వినియోగించారు.












Click it and Unblock the Notifications
