ఉక్రెయిన్‌పై వెనక్కి తగ్గేది లేదు; లక్ష్యాన్ని సాధించి తీరుతాం ! మేక్రాన్‌కు స్పష్టం చేసిన పుతిన్ !!
ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా వెనక్కి తగ్గేలా కన్పించడంలేదు. ఒకవైపు చర్చలు జరుపుతూనే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖర్కివ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో రష్యా దళాలు భీకర దాడులు దిగింది. ఈ దాడులతో చెర్నిహివ్‌లో 22 మంది మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. భయానక పరిస్థితులు నెలకొనడంతో అధికారులు స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Recommended Video

పుతిన్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఫోన్
అటు ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఫోన్ చేశారు. ఇరువురు సుమారు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. ఈసందర్భంగా యుద్ధానికి ముగింపు పలికాలని పుతిన్‌ను కోరారు. శాంతి చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ డిమిలిటరైజేషన్‌ను తప్పక సాధించి తీరుతామని మెక్రాన్‌కు పుతిన్ స్పష్టం చేశారు. అప్పటి వరకు తగ్గేది లేదని స్పష్టం చేశారు.

రష్యా- ఉక్రెయిన్ రెండో విడత చర్చలు
మరోవైపు బెలారస్ సరిహద్దులో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు రెండో విడత చర్చలు చేపట్టారు. ఈ సమావేశంలో యుద్ధ విరమణ, వెంటనే కాల్పుల విరమణ, పౌరులను సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా చర్చలు సాగుతున్నాయి. ఈ చర్చల ద్వారా శాంతి పునరుద్దరింపబడుతుందని తాము భావిస్తున్నట్లు రష్యా పేర్కొంది. తొలి విడత చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈసారైనా చర్చలు ఫలించాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.

రష్యా ప్రభుత్వ, పౌరుల ఆస్తులు సీజ్
ఇదిలా ఉండలా.. రష్యాకు ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా ప్రభుత్వ, పౌరుల ఆస్తుల సీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆస్తులు సీజ్ చేసే చట్టాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌ను పునర్నిర్మిస్తామని ఆదేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు . తమ దేశానికి, పౌరులకు జరిగిన నష్టానికి రష్యా తిరిగి చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఉక్రెనియన్ల గురించి పుతిన్ తక్కువగా అంచనా వేశారని.. తాము రష్యా బెదిరింపులకు భయపడేది లేదని జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications