వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20మంది బాయ్‌ఫ్రెండ్స్‌కు మస్కా: దెబ్బకు ఇల్లే కొనేసింది.. ఎలా?

|
Google Oneindia TeluguNews

బీజింగ్: కూటి కోసం కోటి తిప్పలు పడే వారు కొందరైతే.. అలవోకగా పనులు చక్కదిద్దుకునేందుకు బ్రతకనేర్చిన విద్యలను ప్రదర్శించేవారు మరికొందరు. చైనాకు చెందిన జియోలి అనే యువతి రెండో కోవకు చెందినది. సాధారణంగానే ఆర్థికంగా అంతంతమాత్రంగా నెట్టుకొస్తున్న కుటుంబం కావడంతో.. ఇల్లు కట్టుకోవాలనే తన కలను నెరవేర్చుకోవడానికి బాయ్ ఫ్రెండ్స్ ను బాగా ఉపయోగించుకుంది జియోలి.

ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా 20మంది బాయ్ ఫ్రెండ్స్ ను మాయ చేసిన జియోలి.. వారందరి వద్ద నుంచి 20 ఐఫోన్ 7 ఫోన్లను గిఫ్ట్ గా పొందింది. అలా వచ్చిన గిఫ్టులన్నింటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టగా.. ఆమెకు రూ. 11,40,000 సమకూరాయి. దీంతో అనుకున్నట్టుగానే ఓ మంచి ఇల్లు కొనుగోలు చేసేసింది జియోలి. ఆ తర్వాత 'వెయ్ బో' అనే చైనీస్ సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారిపోయింది.

PHONE SWAP Woman persuades her 20 boyfriends to each buy her an iPhone 7 – then cashes them in and buys a HOUSE

దాదాపు కోటి ముప్పై లక్షల మంది నెటిజెన్స్ జియోలి వ్యవహారంపై స్పందించారు. వీరిలో కొందరు జియోలి తెలివిగల అమ్మాయంటూ మెచ్చుకోగా.. మరికొందరు మాత్రం విమర్శలను ఎక్కుపెట్టారు. ఇంకొందరు 'నాకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు.. అలాంటిది జియోలీ 20మందిని ఎలా పడేయగలిగిందని, ఆ ట్రిక్ నాకు కూడా చెప్పాలి' అంటూ సున్నితంగా చురకలంటించే ప్రయత్నం చేశారు.

షెంజన్ ప్రాంతంలో నివసించే జియోలి.. ఇంటికి పెద్ద కూతురు. దాంతో ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండడం కోసం స్థానికంగా చిన్న ఉద్యోగం చేస్తోంది. తల్లి ఇంటి వద్దనే ఉంటుండగా.. తండ్రి మాత్రం వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెలనెలా వచ్చే ఆదాయంతో సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం లేకపోవడంతో.. ఇలా బాయ్ ఫ్రెండ్స్ ను పావులుగా వాడుకుని సొంతింటి కల నెరవేర్చుకుంది జియోలి. ఏదేమైనా.. బ్రతకనేర్వడమంటే ఇదేనేమో అని జియోలి వ్యవహారాన్ని చూసినవారంతా అభిప్రాయపడుతున్నారు.

English summary
A QUICK THINKING Chinese woman came up with a unique solution to her house buying problem when she asked each of her 20 boyfriends to purchase her an iPhone 7 – which she traded in to buy her first home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X