నెట్లో భయానక ఫోటో: బేబికి గన్ గురిపెట్టిన యువతి!

అప్పటి నుండి చాలామంది చాలాసార్లు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో ఆసక్తికరంగానే కాకుండా భయానకంగా ఉండటంతో నెటిజన్లు వారెవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఎక్కడి నుండి తీసుకున్నారో తెలియక పోవడంతో వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.
చిత్రంలో యువతి తన హ్యాండ్ గన్‌ను తన ఒడిలో ఉన్న పాప రెండు కళ్ల మధ్యలో గురి పెట్టి ఉంది. ఈ పాప వయస్సు చూస్తుంటే రెండేళ్లకు అటు ఇటుగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ తీశారనే విషయమై కొంత సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రం ఓ అర్జెంటేనియన్ ఫేస్ బుక్ పేజి పైన కనిపించినట్లుగా తెలుస్తోంది. పిక్చర్‌లో ఉన్న వారు లాటిన్ అమెరికా వాసులుగా కనిపిస్తోందంటున్నారు.
ఓ ఇంట్లో రెడ్ డ్రెస్ వేసుకున్న ఓ యువతి హ్యాండ్ తుపాకీని తాను ఎత్తుకున్న పాప రెండు కళ్ల మధ్య గురిపెట్టి చూస్తూ నవ్వులు చిందిస్తున్న ఫోటో అది.












Click it and Unblock the Notifications