ఛైల్డ్ పోర్నోగ్రఫీ ఎఫెక్ట్! ఎన్నారై ఫొటోగ్రాఫర్ ఇక జీవితకాలం జైల్లో మగ్గాల్సిందే!
కాలిఫోర్నియా: దేశం మారినా, తన బుద్ధులను మార్చుకోలేదు ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. తన వృత్తిని అడ్డు పెట్టుకుని ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఛైల్డ్ పోర్నోగ్రఫీ రొచ్చులో ఆ బాలికను దింపడానికి ప్రయత్నించాడు. అడ్డంగా దొరికిపోయాడు. దీనితో అతనికి అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇక జీవించినంత కాలం అతగాడు జైలులో మగ్గాల్సిందే. మనదేశానికి చెందిన దీపక్ దేశ్ పాండే అనే వ్యక్తి కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. అక్కడ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు. మోడలింగ్ రంగంలో పేరు తెచ్చకున్నాడు.
ఫ్లోరిడాలోని ఒర్లాండోకు చెందిన ఓ మైనర్ బాలికతో ఆన్ లైన్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తన వృత్తిని అడ్డుగా పెట్టుకుని ఆమెను లోబరచుకున్నాడు. మోడలింగ్ రంగంలో అవకాశాలు ఇస్తానని ఆశచూపి, ఆమె నగ్న ఫొటోలను సేకరించాడు. వాటిని చూపించి తరచూ బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు. శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ బాాలికను కలుసుకోవడానికి తరచూ ఒర్లాండోకు వెళ్లేవాడు. ఆ అమ్మాయిపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని దురాగతాలపై బాధిత బాలిక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌బీఐ ఏజెంట్లు అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించారు. దేశ్ పాండేను అకృత్యాలను పసికట్టారు.

సాక్ష్యాధారాలతో సహా అతణ్ని వలపన్ని పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన తర్వాత ఆ అమ్మాయిని హత్యచేయడానికి దేశ్‌పాండే ప్లాన్ కూడా వేశాడని, అది కుదరలేదని దర్యాప్తులో తేలింది. దేశ్ పాండేను కాలిఫోర్నియా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించడం, ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్న కారణంగా దేశ్ పాండేకు న్యాయస్థానం జీవితకాల శిక్షను విధించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించినందుకు దీనికి అదనంగా మరో 30 ఏల్ల పాటు కారాగార శిక్షను అనుభవించాల్సి ఉంటుందని కాలిఫోర్నియా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications