వయస్సు 77, రికార్డ్: 66 ఏళ్లు సెలవు పెట్టలేదు
మేరీల్యాండ్: ఉద్యోగులు.. ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా సిక్ లీవ్ పెట్టే పరిస్థితి ఉంటుంది! కానీ, ఓ ఫోటో గ్రాఫర్ మాత్రం 66 ఏల్లుగా ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టక పోవడం గమనార్హం. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే సిక్ లీవ్ ఉపయోగించుకుంటుంటారు.
అయితే, అమెరికాలోని ఓ ఫొటో గ్రాఫర్ మాత్రం దశాబ్దాలుగా సిక్ లీవ్ పెట్టలేదు. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని హానోవర్‌కు చెందిన తిమోతీ హైమాన్ మేరీల్యాండ్ స్టేట్ హైవే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఇతను మరికొద్ది రోజుల్లో 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.

పదవీ విరమణ కూడా పొందుతున్నారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం సర్వీసు చేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. మేరీల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి రోడ్డు నిర్మాణాలు, రవాణా వ్యవస్థ మార్పులన్నీ తిమోతీ తన కెమెరాతో తీశారు.
వాటిపై ఎన్నో డాక్యుమెంటరీలు రూపొందించారు. రాష్ట్ర రవాణా వ్యవస్థ మార్పులకు సంబంధించి, రాష్ట్ర చరిత్రకు సంబంధించి ఆయన తీసిన ఫొటోలు ఉన్నాయి. సుదీర్ఘకాలం పని చేయడమే కాకుండా ఇన్నేళ్లుగా సెలవు తీసుకోకుండా నిబద్ధతతో పని చేశాడు. ఇందుకు గాను రాష్ట్ర గవర్నర్ ల్యారీ హోగాన్ తిమోతీని సత్కరిస్తారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications