నటితో ఫ్రాన్స్ అధ్యక్షుడి అఫైర్, ఫొటోల లీక్: ఐదుగురి బదిలీ
పారిస్: ఎలైసీలోని ప్యాలెస్‌లో ఫ్రాంకోయిస్ హాలెండే నటి జూలీ గయేత్ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అయిన సంఘఠనకు సంబంధించి ఐదుగురు అధ్యక్ష సిబ్బందిని బదిలీ చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. ఆ నటితో హాలెండే అఫైర్‌పై జనవరిలో ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో వార్తాకథనాలు వచ్చాయి.
అయితే, గత వారం ప్యాలెస్‌లోని ప్రైవేట్ టెర్రాస్‌లో ఉన్న వారిద్దరి ఫొటోలు బయటకు వచ్చాయి. అవి తీవ్ర కలవరానికి గురి చేశాయి. అవి ఎలైసీలోనివారే తీసినట్లు కనిపించడం ఆ ఆందోళనకు కారణం. హాలాండే (60), గేయెత్ (42) కూర్చున్న ఫొటోలను అక్టోబర్‌లో రహస్యంగా తీసినట్లు వాటిని ప్రచురించిన వోయిసీ సెలిబ్రిటీ మ్యాగజైన్ తెలిపింది.

ఈ సంఘటనపై దర్యాప్తు జరిగినప్పటికీ నిందితులు ఎవరనేది తేలలేదని లిబరేషన్ డైలీ వ్యాఖ్యానించింది. అయితే, వాటిని అధ్యక్షుడి వ్యక్తిగత సిబ్బంది తీసి ఉంటారని పోలీసులు నమ్ముతున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఆయన ప్రైవేట్ అపార్టుమెంట్స్‌లో ఆ ఫోటోలు తీసి ఉంటారని అనుమానిస్తున్నారు.
అధ్యక్షుడి వ్యక్తిగత సేవల కోసం నియోగించిన ఐదుగురు సిబ్బందిని బదిలీ చేసినట్లు అధ్యక్షుడి కార్యాలయం చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. స్కూటర్ హెల్మెట్లో హాలండే పారిస్ అపార్టమెంటులో ఆ నటిని కలిసిన ఫొటోలు జనవరిలో తీవ్ర సంచలనం సృష్టించాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications