న్యూయార్క్: బెంబేలెత్తిస్తున్న మంచుతుఫాను(పిక్చర్స్)
న్యూయార్క్: అమెరికా సంయుక్త రాష్ట్రాలను భయానక మంచుతుపాను బెంబేలెత్తిస్తోంది. ఇళ్లు, రోడ్లు, వంతెనలు ఇలా ప్రతిదీ మంచు కింద కప్పుకుపోయాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడం గమనార్హం. అమెరికా సంయుక్త రాష్ట్రాలను భయానకమైన మంచుతుపాను బెంబేలెత్తిస్తోంది. మొత్తం 50 రాష్ట్రాలు మంచుతో కప్పబడిపోయాయి. ఉష్ణోగ్రత కనిష్టస్థాయి కంటే తక్కువకు పడిపోయింది.
పలు రాష్ట్రాల్లో మంచు తుపానుకు ఐదురుగురు చనిపోయారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలిగే బఫెలో రాష్ట్ర ప్రజలు సైతం ఈ భయానక మంచు తాకిడికి బెంబేలెత్తిపోయారు. దాదాపు నాలుగు అడుగుల మేర అన్ని ప్రాంతాల్లోనూ మంచు పొరలు కమ్ముకున్నాయి. ఇది ఆరడుగుల వరకు పెరిగే అవకాశం కూడా ఉందని గురువారంనాడు మరోసారి మంచు తుపాను వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు.
ఒక్కసారిగా మొత్తం 50 రాష్ట్రాలను భరించలేనంత చలి, ఊహించనంత మంచు ఆవహించడం వల్ల రికార్డు స్థాయిలో కనిష్టం కంటే తక్కువకు ఉష్ణోగ్రత పడిపోయిందని, జనవరిలో సంభవించిన దానికంటే కూడా తాజా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. మంచు తుపానుకు తోడు అత్యంత తీవ్ర వేగంతో పెనుగాలులు వీయడం వల్ల రహదారుల్లో అనేక రకాలుగా ప్రమాదాలు నమోదయ్యాయని వెల్లడించారు.

మంచు తుఫాను
ఇప్పటి దాకా ఈ స్థాయిలో మంచు కురవడాన్ని తాము చూడలేదని స్థానికులు చెబుతున్నారు. పైగా పెనుగాలుల వల్ల ఎగిరిపడుతున్న మంచు ముక్కలు అనేక రకాలుగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

మంచు తుఫాను
న్యూయార్క్ పట్టణంలో ఈ తరహా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దీంతో 212 కిలోమీటర్ల పొడవైన హైవేను మూసివేయాల్సి వచ్చింది.

మంచు తుఫాను
రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించడానికి ప్రత్యేక బృందాలను న్యూయార్క్ నగర గవర్నర్ ఆండ్రూ కియోమో నియమించారు.

మంచు తుఫాను
అలాగే ఎక్కడపడితే అక్కడ వాహనాలు వదిలేసి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టడంతో రోడ్లన్నీ వాహనాలమయంగా మారిపోయాయి.

మంచు తుఫాను
వాటిని తొలగించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. న్యూహాంప్‌షైర్, అట్లాంటా సహా అనేక రాష్ట్రాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొనడం వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

మంచు తుఫాను
అమెరికా సంయుక్త రాష్ట్రాలను భయానక మంచుతుపాను బెంబేలెత్తిస్తోంది. ఇళ్లు, రోడ్లు, వంతెనలు ఇలా ప్రతిదీ మంచు కింద కప్పుకుపోయాయి.












Click it and Unblock the Notifications