పాకిస్తాన్ సర్కార్ బిగ్ షాక్- 4300 కోట్లకు ఎయిర్ లైన్స్ అమ్మేసి..!

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎప్పుడు ఏ దేశం సాయం చేస్తోందో అని ఎదురుచూస్తున్న పాకిస్తాన్ కు ప్రపంచబ్యాంక్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. అమెరికా సాయంతో ప్రపంచబ్యాంక్ ను మచ్చిక చేసుకుని భారీ సాయం పొందేందుకు ప్లాన్ చేసుకున్న పాకిస్తాన్ కు .. అది విధించిన షరతులు షాకిస్తున్నాయి. దీంతో చేసేది లేక ఆర్ధిక పరిస్ధితులు చక్కదిద్దేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఓ జాతీయ ఆస్తిని ప్రైవేటీకరణ చేసేసింది.

పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ (పీఐఏ)ను తాజాగా వేలానికి పెట్టిన ప్రభుత్వం ఇవాళ దాన్ని కాస్తా పూర్తి చేసింది.
రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన పోటీ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత జాతీయ ఎయిర్ లైన్స్ ను ఏకంగా రూ.4,300 కోట్లకు విక్రయించింది. సంవత్సరాల తరబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, విఫలమైన పునరుద్ధరణ ప్రణాళికల తర్వాత నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ నుండి నిష్క్రమించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రధాన అడుగు ఈ అమ్మకం.

PIA Sold Pakistan Gets Rs 4 300 Crore in National Carrier Bidding

ఇవాళ జరిగిన ఎయిర్ లైన్స్ ప్రైవేటీకరణ కార్యక్రమంలో ముగ్గురు ముందస్తు అర్హత కలిగిన బిడ్డర్లు పాల్గొన్నారు. వీరిలో లక్కీ సిమెంట్, ప్రైవేట్ ఎయిర్‌లైన్ ఎయిర్‌బ్లూ, పెట్టుబడి సంస్థ ఆరిఫ్ హబీబ్ ఉన్నారు. అధికారిక ప్రక్రియలో భాగంగా, బిడ్డర్లలో ప్రతి ఒక్కరూ తమ సీల్డ్ బిడ్‌లను పెట్టెలో జమ చేశారు. అనంతరం ఆరిఫ్ హబీబ్ గ్రూప్ ఎయిర్ లైన్స్ ను దక్కించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉప ప్రధాని ఇషాక్ దార్ సంస్ధకు అభినందలు తెలిపారు. ఆరిఫ్ హబీబ్ 115 బిలియన్లు అంటే దాదాపు రూ.3,680 కోట్ల ప్రారంభ ఆఫర్‌తో అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. చివరికి పోటీలో ఇదే సంస్ద రూ.4,320 కోట్లవరకూ వెళ్లి ఎయిర్ లైన్స్ ను దక్కించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+