Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోనికా లెవిన్‌స్కీ, క్లింటన్ సెక్స్ స్కాండల్ (పిక్చర్స్)

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో తనకు గల సంబంధం గురించి 40 ఏళ్ల మోనికా లెవిన్‌స్కీ తాజాగా నోరు విప్పడంతో ఆ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. క్లింటన్‌తో అఫైర్ తెర మీదికి రావడంతో 1990ల్లో లెవిన్‌స్కీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ సంఘటన బిల్ క్లింటన్ అభిశంసనకు కూడా దారి తీసింది.

లెవిన్‌స్కీ 1995 నుంచి 1997 వరకు మోనికా లెవిన్‌స్కీ శ్వేతసౌధంలో అన్‌పెయిడ్ ఇంటర్నీగా చేరారు. అక్కడి చేరినప్పుడు ఆమె వయస్సు 23 ఏళ్లు. 1995 నవంబర్‌లో క్లింటన్, లెవిన్‌స్కీ మధ్య ప్రేమ చిగురించి మోజులు వేసింది.

క్లింటన్ చుట్టూ తిరుగుతోందనే కారణంతో 1996 ఏప్రిల్‌లో లెవిన్‌స్కీని సీనియర్స్ శ్వేతసౌధం నుంచి పెంటగాన్‌కు బదిలీ చేశారు. 1997 డిసెంబర్‌లో ఆమె పెంటగాన్‌లో తన విధుల నుంచి తప్పుకుంది. బిల్ క్లింటన్, లెవిన్‌స్కీ మధ్య సంబంధం గురించి 1998 జనవరిలో న్యూవీక్ మ్యాగజైన్ వార్తాకథనాన్ని ప్రచురించింది.

ఆ కథనంతో తీవ్రమైన చిక్కుల్లో పడిన బిల్ క్లింటన్ తన భార్య హిల్లరీ క్లింటన్‌తో కలిసి 1998 జనవరి 26వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి లెవిన్‌స్కీతో తనకు సంబంధం లేదని ప్రకటించారు. తాను క్లింటన్‌తో లైంగిక చర్యలకు పాల్పడ్డాను గానీ సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేయలేదని లెవిన్‌స్కీ 1998 జులైలో ప్రకటించింది.

1998 ఆగస్టు 17వ తేదీన క్లింటన్ తన తప్పును అంగీకరించారు. ఈ కుంభకోణంతో 1998 డిసెంబర్ 19వ తేదీన క్లింటన్ అభిశంసనకు గురయ్యారు. మీడియా లెవిన్‌స్కీ వెంటపడింది. సామాజిక మానసికశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి లెవన్‌స్కీ 2005లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేరింది.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

క్లింటన్‌తో తనకు గల సంబంధంపై మోనికా లెవిన్‌స్కీ తన సుదీర్ఘ మౌనాన్ని వీడి క్లింటన్‌కు, తనకు మధ్య జరిగిన విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నానని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

తనపై వస్తున్న ఆరోపణలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నట్లు మోనికా లెవిన్‌స్కీ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చెప్పారు.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

బిల్ క్లింటన్‌తో తనకు మధ్య పరస్పర అంగీకార సంబంధమే ఉందని మోనికా లూయిన్ స్కీ ఆ కథనంలో వెల్లడించారు.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

1999లో క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయం (వైట్‌హౌస్)లో ఆమె పని చేశారు. ఆ సమయంలో క్లింటన్‌తో మోనికా లూయిన్ లైంగిక సంబంధం కొనసాగించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

క్లింటన్‌తో సంబంధంపై తాజాగా మోనికా తన మనస్సులోని మాటలను వానిటీ ఫెయిర్ మేగజైన్‌కు ప్రత్యేక ఆర్టికల్ ద్వారా వెల్లడించారు.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

తమ మధ్య జరిగిన దానిపై తీవ్రంగా విచారిస్తున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. తమ మధ్య ఇద్దరు పెద్దవాళ్ల మధ్య ఉండే సంబంధమే నడిచిందని, క్లింటన్ అవకాశం తీసుకున్నాడని వెల్లడించారు.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

మేగజైన్ మోనికా లెవిన్‌స్కీ కథనాన్ని ‘షేమ్ అండ్ సర్వవైల్' పేరిట ప్రచురితం చేసింది. ఈ వ్యవహారంలో తనను బలిపశువును చేసే ప్రయత్నం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

ఆ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత 10 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించడానికి వీలున్న ఆఫర్లను తాను తిరస్కరించినట్లు లెవిన్‌స్కీ చెప్పారు. ఆ విధంగా చేయడం మంచిది కాదనిపించినట్లు అన్నారు.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యల పట్ల మోనికా లెవిన్‌స్కీ విచారం వ్యక్తం చేశారు. అప్పటి వ్యవహారాన్ని సరైన మార్గంలో పెట్టడానికే తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

మోనికా లెవన్‌స్కీతో సంబంధం బయటపడడంతో బిల్ క్లింటన్ పతనం ప్రారంభమైంది. ఆయన అభిశంసనకు గురయ్యారు. లెవిన్‌స్కీపై మీడియా దృష్టి పడింది.

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

లెవిన్‌స్కీ, క్లింటన్ అఫైర్

క్లింటన్‌తో తాను ఇంటర్‌కోర్స్ చేయలేదని, ఓరల్ సెక్స్‌తో పాటు తొమ్మిది లైంగిక చర్యలకు పాల్పడ్డానని లె‌విన్‌స్కీ అప్పట్లో చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+