Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మందేసిన వరాహం: మూడు బీర్ బాటిల్స్ స్వాహా! (వీడియో)

ఎంతకీ దాహం తీరకపోవడంతో.. ఓ వ్యక్తి తాగేందుకని తన పక్కనే పెట్టుకున్న బీర్ సీసాపై వరాహం కన్నుపడింది.

మెక్సికో: మనుషులే కాదు ఈమధ్య కోతులు, ఇతర జంతువులు సైతం మనుషులను మించిపోయేలా మందేస్తున్నాయి. తాజాగా ఓ వరాహం ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు బీర్లు స్వాహా అనిపించింది. వరాహం బీర్ తాగడమేంటి? అని ఆశ్చర్యపోతున్న జనం.. ఇప్పుడా వీడియోను ఎగబడి చూస్తున్నారు.

మెక్సికోలోని ఓ బార్ ఎదుట జరిగిన ఈ సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. బాగా దాహంతో ఉన్న ఓ వరాహం బార్ ముందు తచ్చాడుతూ ఖాళీ బీర్ సీసాల్లో అడుక్కు మిగిలిపోయిన చుక్కలను తాగడానికి ప్రయత్నించింది. అయితే ఎంతకీ దాహం తీరకపోవడంతో.. ఓ వ్యక్తి తాగేందుకని తన పక్కనే పెట్టుకున్న బీర్ సీసాపై వరాహం కన్నుపడింది.

అంతే, అమాంతం ఆ బాటిల్ ను ఎత్తుకుపోయి చుక్క మిగిల్చకుండా తాగేసింది. ఆ తర్వాత కిక్కే ఎక్కిందో? లేక రుచికి మరిగిందో తెలియదు గానీ మరో సీసా కోసం వెతకడం మొదలుపెట్టింది. ఇంతలో దాని కష్టాన్ని చూడలేకపోయిన ఓ వ్యక్తి మరో రెండు బీర్ బాటిల్స్ కొని దాని ముందు పెట్టడంతో.. ఆ రెండు బాటిల్స్ ను ఖాళీ చేసి పారేసింది. ఈ సందర్బంగా తీసిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+