కాక్‌పిట్‌లో నిద్రపోయిన పైలట్, వీడియో తీసిన కోపైలట్: ఇద్దరూ ఔట్
బీజింగ్: చైనాలో బోయింగ్ 747 విమానం ఎగురుతున్న సమయంలో పైలట్ కాక్‌పిట్‌లో నిద్రపోయాడు. అది చూసిన కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్‌గా మారింది. దీంతో వారిద్దరిని తొలగించారు. ఈ సంఘటన చైనా ఎయిర్ లైన్స్‌లో జరిగింది.
ఇటీవల మనం పలు విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటోన్న విషయం చూస్తూనే ఉన్నాం. వాతావరణం అనుకూలించకపోవడమో, లేక సాంకేతిక లోపమో విమాన దుర్ఘటనలకు కారణమవుతున్నాయి. కానీ ఇప్పుడు మానవ తప్పిదం జరిగింది. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

విమానం ఎగరగానే చైనా ఎయిర్ లైన్స్‌లో సీనియర్ పైలట్ నిద్రపోయాడు. పక్కనున్న కో పైలట్ ఓ వైపు విమానాన్ని కంట్రోల్ చేస్తూ, మరోవైపు పైల్ నిద్రపోవడాన్ని వీడియో తీశాడు. సదరు సీనియర్ పైలెట్‌కు 20 ఏళ్ల ఎక్స్‌పీరియెన్స్ ఉంది.
అతను నిద్రపోవడానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీంతో ఇది వెలుగు చూసింది. దాంతో చైనా ఎయిర్ లైన్స్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నిద్రపోయిన పైలెట్ పైన తొలుత వేటు వేశారు. ఆ తర్వాత ఏమాత్రం కో పైలెట్‌ను క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి తొలగించారు. పైలట్ నిద్రపోతుంటే లేపాల్సింది పోయి వీడియో తీయడాన్ని తప్పుబట్టారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications