ప్రియురాలి హత్య: పిస్టోరియాకు మానసిక రుగ్మత లేదు

ప్రిటోరియా: తన ప్రియురాలిని హత్య చేసిన సమయంలో బ్లేడ్ రన్నర్, పారాలింపియన్ అస్కార్ పిస్టోరియస్‌కు మానసిక అనారోగ్యం ఏమి లేదని మానసిక నిపుణుల బృందం, ఓ సైకాలజిస్టు గుర్తించారని ప్రాసిక్యూటర్ గేరీ నెల్ సోమవారం తెలిపారు. హత్య చేసిన సమయంలో పిస్టోరియా మానసిక పరిస్థితి బాగానే ఉందని ఆయన వెల్లడించారు.

ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంపును బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ గత ఏడాది కాల్చి చంపిన విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు వేకువజామునే పిస్టోరియస్ ఆమెను కాల్చి చంపాడు. ఆ రాత్రి అంతా ఆమెతో అతను వాగ్వాదానికి దిగాడనే విమర్శలు వచ్చాయి. అనంతరం అతనిని పోలీసులు అరెస్టు చేశారు.

Pistorius did not suffer from mental illness at the time of shooting his girlfriend

కేసు విచారణలో భాగంగా మానసిక నిపుణుల బృందం అతన్ని పరీక్షించి ఇచ్చిన నివేదిక పిస్టోరియా మానసిక స్థితి హత్యా సమయంలో బాగానే ఉందని వెల్లడించినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. అతని ప్రియురాలి హత్య కేసులో పిస్టోరియానే దోషి అని అన్నారు.

మానసిక ఆందోళన అనే రుగ్మత వల్లే తన ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంపు(29)ను కాల్చిచంపానని తన వాదనను వినిపించాడు పిస్టోరియా. కాగా, ఇది ఖచ్చితంగా కావాలని చేసిన హత్యేనని ప్రాసిక్యూషన్ పేర్కొంది. మానసిక నిపుణుల బృందం అతనికి ఎలాంటి మానసిక రుగ్మత లేదని స్పష్టం చేసిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+