కుప్పకూలిన విమానం: 9మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విహారయాత్ర కోసం వెళ్తుండగా అలెస్కా ఆగ్నేయ ప్రాంతంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9మంది ప్రయాణికులు మృతి చెందారు.
గురువారం అదృశ్యమైన విమానం ఆచూకీ తెలియడంతో అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హాలెండ్ అమెరికా లైన్‌కు చెందిన ఈ సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణించిన వారందరూ మరణించినట్లు నిర్ధారించారు.

కాగా, డిహెవీలాండ్ డిహెచ్‌సి-3 ఒట్టర్ టర్బోప్రాప్ విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని తెలిపారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదని అధికారులు చెప్పారు.
భారీ వర్షాలు, విపరీతమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. శుక్రవారం పగటిపూట మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications