విమాన ప్రమాదం... ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు మృతి..
విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ మృతిచెందారు. అమెరికా నుంచి సెయింట్ లూసియాకు తమ సొంత విమానంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. లూసియాకు వెళ్లే క్రమంలో పెటిట్ నివిస్ ఐలాండ్ వద్ద వారి విమానం కరీబియన్ సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్‌తోపాటు అతని కుమార్తెలు మదిత, అన్నిక్ కూడా ప్రాణాలను కోల్పోయారు.
తూర్పు కరేబియన్‌లోని ఒక చిన్న ద్వీపం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అమెరికా నటుడు క్రిస్టియన్ ఆలివర్, అతని ఇద్దరు కుమార్తెలు మరణించినట్లు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌లోని పోలీసులు వెల్లడించారు. విమానం సమీపంలోని సెయింట్ లూసియాకు వెళుతుండగా బెక్వియా సమీపంలోని పెటిట్ నెవిస్ ద్వీపానికి పశ్చిమాన ప్రమాదానికి గురయ్యిందని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదం జనవరి 4న సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు ఆయన కుమార్తెలు మదితా క్లెప్సర్(10), అన్నీక్ క్లెప్సర్, (12)తో పాటు పైలట్ రాబర్ట్ సాక్స్ కూడా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి కారణమేమిటో ఇంకా స్పష్టత రాలేదు.

కోబ్రా 11 సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు : ఈ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఆలీవర్ జర్మనీలో జన్మించారు. ఈయన ఇండియానా జోన్స్, స్పీడ్ రేసర్, కోబ్రా 11 సిరీస్‌లోని పాత్రలతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 'ది గుడ్ జర్మన్', 2008 లో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా వచ్చింది. 'స్పీడ్ రేసర్' మూవీలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గురువారం తన సొంత విమానంలోనే ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుకు విమానం కుప్పకూలిపోయిందని పోలీసులు వివరించారు. విమానం కూలిపోయిన విషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు, కోస్టు గార్డులు, డైవర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే విమానంలోని వారంతా చనిపోయినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications