ఇళ్లపై కూలిన విమానం: ఏడుగురు మృతి
బొగోటా: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం ఇళ్లపై కుప్పకూలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పొపయాన్ నగర శివారులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు స్థానిక విమానయాన శాఖ అధికారులు తెలిపారు.
ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందని తెలిపారు. ఇళ్ల మధ్య ఆడుకుంటున్న ఓ బాలుడు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications