వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుప్పకూలిన విమానం: 9 మంది మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు
వాషింగ్టన్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పిలాటన్ పీసీ-12 రకానికి చెందిన విమానం కుప్పకూలడంతో అందులోని 9మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి.
మృతుల్లో పైలట్ సహా ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 12 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

దక్షిణ డకోటాలోని చెంబలీన్ అనే ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాతావరణ అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
కాగా, ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ బృందం క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!