విమాన ప్రమాదం : రాబందును 'ఢీ' కొట్టి.. ఇళ్ల మధ్యన కూలి..
మాడ్రిడ్ : పక్షిని 'ఢీ' కొట్టి విమానం కుప్పకూలిన ఘటన స్పెయిన్ లో చోటు చేసుకుంది. పోర్చుగల్ లోని కోయింబ్రా నుంచి ఫ్రాన్స్ కి వెళ్తున్న ఓ తేలికపాటి విమానం ఆకాశంలో అడ్డుగా వచ్చిన రాబందును 'ఢీ' కొట్టింది. దీంతో అదుపు తప్పిన విమానం స్పెయిన్ కు ఉత్తర ప్రాంతంలో ఆర్బిజు అనే గ్రామంలో రెండు ఇళ్ల నడుమ కూలిపోయింది.

ప్రమాదంలో విమానంలోని ముగ్గురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా..! విమానం కూలినప్పుడు ఘటన జరిగిన ఇళ్లలో ఎవరు లేకపోవడంతో అక్కడ ప్రాణ నష్టమేమి సంభవించలేదు. విమాన ప్రమాదాన్ని చూసిన అక్కడి స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications