కారుపైకి దూసుకెళ్లిన విమానం(వీడియో)

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం రోడ్డుపై నిలిపి ఉన్న కారుపైకి దూసుకెళ్లింది. లాంకేయిర్‌-4 తేలికపాటి విమానం ప్రమాదవశాత్తు రోడ్డుపై ల్యాండవుతూ జారిపోయింది.

ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా పైలట్‌తో పాటు మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఐదేళ్లుగా ఉపయోగిస్తున్న ఈ విమానానికి ఇప్పటి వరకు ఎలాంటి సాంకేతిక సమస్యా తలెత్తలేదని.. అయితే ఈప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. విమాన పైలట్ చాలా అనుభవజ్ఞడైనప్పటికీ ఈ ప్రమాదాన్ని తప్పించలేకపోయాడని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+