పెళ్లామా మజాకా..! పక్క సీటు అమ్మాయిని చూస్తున్నాడని మొగున్ని పరిగెత్తిచ్చి కొట్టింది..! (వీడియో)
Recommended Video
భర్త పట్టించుకోకపోతే ఏ భార్యైనా ఏం చేస్తుంది. అలుగుతుంది. ఏడుస్తుంది. గొడవ పెట్టుకుంటుంది. కానీ అమెరికాలో ఓ మహిళ మాత్రం తనను పట్టించుకోవడం లేదని మొగుడిని ఉతికి ఆరేసింది. అదీ ఇంట్లో అనుకుంటే పొరపాటే. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో భర్తను పరిగెత్తించి మరీ కొట్టింది. అపరకాళికలా మారిన ఆమెను చూసి ఫ్లైట్‌లోని ఇతర ప్యాసింజర్లు షాక్ అయ్యారు.
భర్త పట్టించుకోవడంలేదని
గత ఆదివారం మియామి నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌కు రెడీ అవుతోంది. ఈక్వెడార్ వెళ్లిన మెక్ లామోర్, ఆమె భర్త అదే విమానంలో లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరారు. అయితే ఫ్లైట్‌లో ఎక్కిన తర్వాత భర్త ప్రవర్తన లామోర్‌కు నచ్చలేదు. ఆయన తనతో మాట్లాడకపోవడంతో పాటు పట్టించుకోవడం లేదని కోపం వచ్చింది. ఇంతలో మొగుడు కాస్తా పక్కనున్న అమ్మాయిని చూడటంతో అది చూసిన భార్యకు కోపం నషాళానికంటింది. ఒక్కసారిగా సీట్‌లోంచి లేచి తనను పట్టించుకోకుండా వేరే అమ్మాయిని చూస్తున్న భర్తను బండ బూతులు తిట్టింది. అడ్డుకోబోయిన ఫ్లైట్ అటెండెంట్‌ను అనరాని మాటలు అంది.

ల్యాప్‌టాప్‌తో దాడి
భార్య బండ బూతులు తిడుతుంటడంతో ఫ్లైట్ అటెండెంట్ భర్తను వేరే సీటుకు వెళ్లి కూర్చోవాలని కోరింది. దీంతో ఆయన సీటులోంచి లేవగానే లామోర్ ఉగ్ర కాళి అవతారం ఎత్తింది. సీటులోంచి లేచి వచ్చిన భర్తపై ఒక్కసారిగా దాడికి దిగింది. దీంతో అతను ఆమె నుంచి తనను తాను రక్షించుకునేందుకు అక్కడి నుంచి పరిగెత్తగా వెంబడించి మరీ అతనిపై ల్యాప్ టాప్ విసిరింది. అది కాస్తా భర్తతో పాటు ఫ్లైట్ అటెండెంట్ మరో ప్యాసింజర్‌కు తగలి వారికి గాయాలయ్యాయి. కోపంతో ఊగిపోయిన లామోర్ సీట్ వద్దకు వచ్చి పైన ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్ నుంచి తన బ్యాగ్ తీసుకుని ఫ్లైట్ దిగి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

లామోర్ కోసం పోలీసుల గాలింపు
లామోర్ ఫ్లైట్ దిగిన తర్వాత ఆమె భర్త కూడా విమానం నుంచి దిగిపోయాడు. ఫ్లైట్‌లో రచ్చ చేసిన ఆమెపై విమానసిబ్బంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు వచ్చే సరికి లామోర్ పత్తాలేకుండా పోయింది. దాడి చేసినందుకుగానూ ఆమె భర్తను కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరగా అందుకు ఆయన నిరాకరించారు. అయితే ఫ్లైట్‌లో గొడవ చేసినందుకుగాను లామోర్‌పై కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. గొడవ జరిగిన సమయంలో భర్త ఎమర్జెన్సీ డోర్ పక్క సీట్‌లో కూర్చున్నాడు. ఒకవేళ విమానం టేకాఫ్ అయ్యాక ఈ గొడవ జరిగి ఉంటే మిగతా ప్రయాణీకుల పరిస్థితి ఏమయ్యేదో అని అంటున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications