మేకప్ స్కాం: ఇద్దరు మహిళా మంత్రులు రాజీనామా
టోక్యో: రాజకీయ విరాళాలను మేకప్ సామాగ్రి కోసం వాడుకున్నారన్న ఆరోపణలతో జపాన్ పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రధాన మంత్రి షింజో ఎబే ఆమోదించారు. ఈ వ్యవహారం మొత్తం ప్రధానికి పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు.
యుకో ఒబుచి అనే మహిళా మంత్రి వాస్తవానికి జపాన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి కూడా అవుతారని ఓ దశలో అందరు భావించారు. అయితే మేకప్ కుంభకోణంలో ఆమె పేరు బయటకు రావడం గమనార్హం. దీంతో ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ విషయమే తాను త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు బయటపెడతానని ఒబుచి చెప్పారు.
2012 డిసెంబర్ నెలలో షింజో ఎబె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన మంత్రివర్గంలో యుకో ఒబుచి అత్యంత కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన పేరు తెచ్చుకున్నారు. దాదాపు 58 లక్షల రూపాయల మొత్తాన్ని సౌందర్య సాధనాలు, ఇతర సామాగ్రి కోసం ఓ డిపార్టుమెంట్ స్టోర్‌లో ఖర్చు పెట్టినట్లు తేలింది.

యుకో ఒబుచితో పాటు న్యాయశాఖ మంత్రి మిడోరి మత్సుషిమా కూడా ఇందులో ఇరుక్కున్నారు. ఈమె కూడా సోమవారం రాజీనామా సమర్పించారు. షింజో ఎబో మంత్రివర్గంలో ఐదుగురు మహిళా మంత్రులు ఉన్నారు. వీరి రాజీనామాతో ఆ సంఖ్య మూడుగా ఉంది.
ఆ ఇద్దర్ని మంత్రివర్గంలోకి తానే తీసుకున్నానని, ఓ ప్రధానిగా.. వారు చేసిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నానని షింజో ఎబే విలేకరుల సమావేశంలో అన్నారు. వారి స్థానంలో త్వరలోనే కొత్త వారిని తీసుకుంటామని చెప్పారు. అధికార పగ్గాలు చేపట్టాక ఎబేకు ఇది తొలి కుదుపు అంటున్నారు.
గాంగ్నమ్ స్టైల్' తరహాలో చైనాను ఊపేస్తున్న పాట
దక్షిణకొరియా గాయకుడు సై కేవలం ఒక్క పాటతో గ్లోబల్ పాప్యులారిటీ సొంతం చేసుకున్నాడు. సై ఆలపించిన గాంగ్నమ్ స్టైల్ గీతం ఆన్‌లైన్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడదే తరహాలో చైనాలోనూ ఓ పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఆ గీతం పేరు లిటిల్ ఆపిల్.
చాప్ స్టిక్ బ్రదర్స్ పేరిట జియావో యాంగ్, వాంగ్ తైలీ రూపొందించిన ఈ గీతం వాస్తవానికి వారి సినిమా ప్రమోషన్ కోసం రూపొందించినది. జులైలో సినిమా విడుదల కాగా, సినిమా కంటే ఈ పాటే ప్రజాదరణ పొందింది. క్యాచీ ట్యూన్, విచిత్రమైన పదాలతో తమాషాగా సాగే ఈ పాట వివిధ వర్గాల ప్రజల్లోకి త్వరగా చొచ్చుకెళ్ళింది. సోహు, ఇకియి, యౌకు వంటి చైనా వీడియో సైట్లలో ఈ పాట ప్రభంజనం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications