నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను మరోసారి హెచ్చరించారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో తమకు సహకరించకుంటే, భారత దిగుమతులపై ప్రస్తుత టారిఫ్ ను మరింత పెంచుతానని తేల్చి చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో తాజాగా విలేకరులతో ఆయన మాట్లాడారు. రష్యా చమురు దిగుమతుల అంశాన్ని ప్రస్తావించారు. ఒకవంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూనే చురకలు అంటించారు.

ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు డొనాల్డ్ ట్రంప్. "నేను సంతోషంగా లేనని ఆయన (ప్రధాని మోదీ)కు బాగా తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా అవసరం. వారు (భారత్) నిజంగా నన్ను సంతోషపెట్టాలనుకున్నారు. అలా చేయకపోతే వారిపై ఉన్న టారిఫ్ ల భారం మరింత పెంచవచ్చు. అది త్వరలోనే జరుగుతుంది..." అని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ ముడిచమురును కొనుగోలు చేయకూడదని ఆయన అన్నారు.

PM Modi knew I was not happy It was important to make me happy says Donald Trump

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. రష్యాను బద్ధశత్రువుగా పరిగణించారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు.

వెనుజులా రాజధానిపై అమెరికా దాడిపైనా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైనదని, దీనివల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనేది తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్ లో సంభవించిన మరణాలు, ఇతర నష్టాలకు తాను బాధ్యుడిని కాదని బదులిచ్చారు. ఆ ప్రశ్నను తనను అడగొద్దని, తాను ఇచ్చే సమాధానం చాలా వివాదాస్పదంగా మారవచ్చని అన్నారు. దాడి బాధ్యత మాత్రం తమదేనని చెప్పారు.

రష్యా అధ్యక్షుడి నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందని వచ్చిన వార్తలపై ట్రంప్ స్పందించారు. ఆ దాడి నిజంగా జరిగిందంటే నమ్మట్లేదని అన్నారు. తన ఇంటిపై దాడి జరిగిందని వ్లాదిమీర్ పుతిన్ చెప్పినప్పటికీ, దీనిపై తాము తనిఖీ చేశామని, అది నమ్మశక్యంగా లేదని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేయాలనుకుంటున్నానని, తాను మాత్రమే ఆపగలమని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+