పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఉక్రెయిన్‌పై చివరి అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న రష్యా

ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో ఎటు చూసినా భయాందోళనకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను టార్గెట్ చేస్తూ రష్యా మిస్సైల్స్, బాంబులతో ధ్వంసం చేస్తోంది. పలు చోట్ల శవాలు కుప్పలు కుప్పలుగా కన్పిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ అండర్ గ్రౌండ్ లలో గడుపుతున్నారు. ఈ మారణహోమం ఎంతకు దారితీస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన పట్టణాలలో రష్యా తన సేనలతో విరుచుకుపుడుతోంది.

 2వేల మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

2వేల మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 2వేల మందికిపైగా తమ పౌరులు మరణించారని ఉక్రెయిన్ ప్రకటించింది. అటు ఉక్రెయిన్ ప్రధాన పట్టణాల్లో ఒకటైన ఖార్కివ్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఖార్కివ్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా బలగాలు దూసుకుపోతున్నాయి.

 పుతిన్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్

పుతిన్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్

ఈ పరిస్థితుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని మోదీ ఫోన్ చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కారించుకోవాల‌ని సూచించారు. అటు భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు సురక్షిత మార్గం కల్పించాలి కోరారు. దీంతో సాయంత్రం 6 గంటలకు వరకు కల్పించిన సేఫ్ ప్యాసేజీని వినియోగించుకునేందుకు రష్యా వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు త‌మ పౌరులు మృతి చెందార‌ని పుతిన్ దృష్టికి మోదీ తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం.

 ఖార్కివ్ వీడాల‌ని భార‌తీయుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు

ఖార్కివ్ వీడాల‌ని భార‌తీయుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు

ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు దిగ‌జార‌డంతో భారత రాయబారి కార్యాలయం అప్రమత్తం అయింది. తక్షణమే భారతీయులు ఖార్కివ్ ను వదిలి వెళ్లాలని అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. రష్య బలగాలు యద్ధాన్ని ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది. కాలినడకనైనా ఈ నగరాన్ని నుంచి బాబే, బెజ్లిడోవ్వా, పెసోచిన్ ప్రాంతాలకు తరలిపోవాలని పేర్కొంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చే ఆపరేషన్ గంగ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 17వేల మందిని ఉక్రెయిన్ నుంచి భారతీయులు వీడారని తెలిపింది.

 ర‌ష్యా చివ‌రి అస్త్రం సిద్ధం

ర‌ష్యా చివ‌రి అస్త్రం సిద్ధం


ఖార్కివ్ ను చేజిక్కించుకునేందుకు వెనుకాడేది లేదని .. దీనికి ఏమాత్రం ఆలస్యం చేయబోమని రష్యా పేర్కొంది. అందుకోసం చిట్టచివరి అస్త్రాన్ని కూడా ప్రయోగించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అణ్యాయుధాల్ని సిద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనికులకు ఆదేశించారు. ఇందులో భాగంగానే బేరెంట్స్ సముద్ర జాల్లాలోకి అణు సబ్ మెరైన్ మిస్సైల్స్ ను తరలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+