ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ.. తక్షణ శాంతికి పిలుపు

PM Modi: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది. అమెరికా వైమానిక దళం బీ2 బాంబర్ విమానాలు ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు స్థావరాలపై భారీ వైమానిక దాడులు చేశాయి. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమాచారాన్నిఎక్స్ వేదికగా అందించారు. ప్రధాని మోడీ ఇలా రాసుకొచ్చారు. "నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిని మేము వివరంగా చర్చించాం. సైనిక వివాదంపై నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించడానికి దౌత్య మార్గాన్ని అనుసరించాలని సూచించాం. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేశాను." అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

PM Modi Urges Peace in Call with Iran President Amid US Strikes

దాడులను ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా దాడులను తీవ్రంగా ఖండించింది. శాంతియుత అణు ప్రదేశాలపై ఈ అమెరికా దాడి ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2, పేరా 4 ఉల్లంఘన అంటూ ఇరాన్ పేర్కొంది. ఇది బలప్రయోగాన్ని నిషేధిస్తుంది. సభ్య దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం గురించి మాట్లాడుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాలని.. అంతర్జాతీయ సూత్రాలు, ప్రమాణాలను ఉల్లంఘించినందుకు అమెరికా బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+