మనదే: మాడిసన్ స్క్వేర్‌ను ఉర్రూతలూగించిన మోడీ

న్యూయార్క్: అమెరికాలోని మాడిసన్ స్క్వేర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉర్రూతలూగించారు. ఈ శతాబ్దం మనదేనని ప్రకటించారు. భారతదేశానికి తలవంపులు తెచ్చే పనేదీ ప్రభుత్వం చేయదని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం 100 శాతం విజయవంతమవుతుందని, అభివృద్ధిని ప్రజా ఉద్యమం చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రధాని పదవి చేపట్టాక ఇప్పటివరకూ కనీసం 15 నిమిషాలు కూడా తాను విశ్రాంతి తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ శతాబ్దం మనదేనని ఆయన ప్రకటించారు.

2022 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతుందని.. అప్పటికల్లా ప్రతి భారతీయుడికీ ఇల్లు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ప్రవాస భారతీయులను, భారత సంతతి అమెరికన్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అమెరికాలోని భారతీయులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రవాస భారతీయుల కరతాళ ధ్వనుల మధ్య వేదిక వద్దకు చేరుకున్న మోడీ ‘భారత్‌ మాతాకీ జై' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

PM Narendra Modi enthralls a rapturous crowd at Madison Square Garden

భారతీయుల ఐటీ ప్రతిభ నుంచి ఇస్రో మామ్‌ ప్రయోగం దాకా పలు అంశాలను స్పృశిస్తూ దేశ గొప్పదనాన్ని పదేపదే గుర్తుచేశారు. మన పూర్వీకులు పాముల్ని ఆడించేవాళ్లని, కానీ మనం (కంప్యూటర్‌)మౌస్‌తో ఆడుకుంటున్నామని అన్నారు. మన కుర్రాళ్లు మౌస్‌ను కదిలించి ప్రపంచాన్నే కలిపేస్తున్నారని యువతను కొనియాడారు.

ఎన్నికల్లో గెలవడం పదవి కోసమో కుర్చీ కోసమో కాదని అన్నారు. స్వాతంత్య్ర పోరాటం జాతీయ ఉద్యమంలా సాగినట్టే అభివృద్ధి సాధన కూడా జాతీయ ఉద్యమం కావాలన్నారు. దేశాభివృద్ధిని ప్రజా ఉద్యమంగా మలుస్తామని స్పష్టం చేశారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల్లో అక్కడ కలిగిన మార్పును చూసేందుకు విదేశాల్లో ఉన్న భారతీయులను దేశానికి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించానని, ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పారు.

దాదాపు 75 నిమిషాల పాటు అక్కడున్న అందరినీ మోడీ మంత్రముగ్ధులను చేసింది. ‘మోడీ.. మోడీ..' అంటూ వారు చేసిన నినాదాలతో మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ మారుమోగిపోయింది. తాను ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ వారిని మరింత ఉత్సాహపరిచేలా ప్రసంగించిన మోడీ ‘భారత్‌ మాతా కీ జై' నినాదంతోనే ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమం చివర్లో భారత జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగుల బెలూన్లను ఆడిటోరియం పై భాగం నుంచి కిందికి జారవిడువడంతో కేరింతలు మిన్నుముట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+