సంచలన వీడియో: దిల్లీలో పేలుళ్లు.. పాకిస్థాన్ లో సంబరాలు..!

నవంబర్ 10 సోమవారం సాయంత్రం 6 గంటల 51 నిమిషాల సమయంలో దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందారు. మరికొంత మంది క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా దిల్లీ పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లతోపాటు ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్‌ తీవ్రంగా పరిగణించింది.

అయితే ఇదే సమయంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లో లష్కరే- ఈ- తోయిబా ఉగ్రవాదులు సంబరాలు చేసుకున్నారు. దిల్లీ కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే దిల్లీ పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది. దిల్లీ పేలుడు ఘటన ముమ్మాటికీ లష్కర్- ఈ- తోయిబా ఉగ్రవాద సంస్థ పనేనని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ అనుమానాలకు ఈ వీడియో మరింత బలాన్ని చేకూర్చింది.

PoK Party of Peril LeT Chiefs Garlanded in Viral Vid as Delhi Mourns Blasts

దిల్లీ బ్లాస్ట్ తర్వాత లష్కర్ కమాండర్లు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా వీడియోలో ఉంది. లష్కర్ కమాండర్లకు పూలతో స్వాగతం పలకడం, వారి మెడలో పూల మాలలు వేయడం వీడియోలో స్పష్టంగా ఉంది. అక్కడి వాతావరణం విజయోత్సవంగా ఉంది. దీంతో దిల్లీ పేలుడు ఘటనలో వీరి పాత్ర ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. అందుకే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీ పేలుళ్ల తర్వాత హై లెవెల్ మీటింగ్ ఎందుకు పెట్టారు..? సంబరాలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి..? అనే వాటిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఈ సమావేశంలో సీనియర్ లష్కర్- ఈ- తోయిబా నాయకులు అబ్దుల్ రౌఫ్, రిజ్వాన్ హనీఫ్ లు పాల్గొన్నారు. హనీఫ్.. లష్కర్- ఈ- తోయిబా, జైషే-ఈ- మహ్మద్ సంస్థల మధ్య కీలక నేతగా చెబుతున్నారు. అయితే భారత ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సమావేశంపై దృష్టి పెట్టారు. పలు కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు, సమావేశం ఆధారంగా దిల్లీ పేలుళ్లకు సంబంధించిన మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+