కామోన్మాది: 8 మంది మహిళలపై లైంగిక దాడి

లండన్: లండన్ నగరంలో ఓ కామోన్మాది తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాడు. ఒంటరి మహిళలపై కన్నేసి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఏకంగా ఎనిమిది మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అతి తక్కువ సమయంలో అతను ఈ దాడులకు పాల్పడ్డాడు.

ఈ కామోన్మాది విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ లండన్ పోలీసులు ఒంటరి మహిళలను హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఆఫీసు నుంచి ఇంటికి చేరుకునే మార్గం విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే మీ దగ్గరలో ఎవరైనా ఉండేలా చూసుకోండి. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో సంచరించకండి' అని వారు హెచ్చరిక జారీ చేశారు. క్లాఫాం, బ్రిక్స్‌టన్ హిల్‌ ఏరియాల్లో గస్తీని పెంచారు.

Police hunt for serial sex attacker after eight women are assaulted in the street

నిందితుడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజిని విడుదల చేశారు. నిందితుడు పశ్చిమాసియా దేశాలకు చెందిన వ్యక్తిలా కనిపిస్తున్నట్లు వారు వెల్లడించారు. అక్టోబర్‌ 9వ తేదీన క్లితెరో రోడ్‌లో 23 ఏళ్ల మహిళలపై తొలుత లైంగిక దాడికి పాల్పడిన ఈ కామోన్మాది ఆ తర్వాత రెండు గంటల్లోనే మరో 30 ఏళ్ల మహిళపై అఘాయిత్యం చేశాడు.

ఆ తర్వాత అక్టోబర్‌ 22, 26, 28 తేదీల్లో మరో ఆరుగురు మహిళలపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఒక సిసిటీవీ ఫుటేజీలో మాత్రం ఓ మహిళ ఇంట్లోంచి బయటకు వస్తుండగా రికార్డు అయింది. అతను 20, 30 ఏళ్ల మధ్య వయస్సు గల యువతులపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వెనక నుంచి వచ్చి అమాంతం దాడి చేస్తుండడంతో మహిళలకు అప్రమత్తయమ్యే అవకాశం కూడా లేకుండా పోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+