నాకు ఈ భూమ్మీద బతకాలని లేదు: కమెడియన్ పోస్ట్ కలకలం, మాజీ ప్రేయసి ఏం చెప్పిందంటే
న్యూయార్క్: హాలీవుడ్ కమెడియన్ పీట్ డేవిడ్సన్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ అందరికీ ముచ్చెమటలు పట్టించింది. పోలీసులు రంగంలోకి దిగి అతని వద్దకు చేరుకునే వరకు వచ్చింది. ఈ భూమిపై జీవించాలని అనిపించడం లేదని అతను పెట్టిన పోస్ట్ కలకలం రేపింది.
'నీకోసం ఇక్కడ ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంతవరకు ఉంటాననేది తెలీదు. నాకు ఈ భూమి మీద ఉండాలని లేదు. నేను ఇప్పటి వరకు ప్రజలకు సాయం చేస్తూ వచ్చాను. ఈ విషయం నీతో కూడా చెప్పినట్లు గుర్తు' అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు, ఆ పోస్ట్ పెట్టిన కాసేపటికి అతను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకొన్నారు.

దాంతో అప్రమత్తమైన న్యూయార్క్ పోలీసులు హుటాహుటిన అతని ఇంటికి చేరుకున్నారు. కానీ ఆయన క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డేవిడ్‌సన్ పెట్టిన పోస్ట్‌పై ఆయన మాజీ ప్రేయసి, గాయని ఆరియానా గ్రాండే స్పందించారు.
తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, నీకు ఏదన్నా సాయం కావాలంటే తనను అడగొచ్చునని, నీకు కావాల్సిన వారంతా నీ చుట్టూనే ఉన్నారని తెలుసుకోవాలని, కానీ తనకు అందరి క్షేమం ముఖ్యమని ఆమె పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా, డేవిడ్‌సన్ పోస్ట్‌తో అభిమానులు షాకయ్యారు. డేవిడ్‌సన్ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా స్పందించారు.












Click it and Unblock the Notifications