స్విట్జర్లాండ్‌లో కాల్పులు, ఏడుగురు మృతి
బెర్లిన్: స్విట్జర్లాండ్‌లోని ఓ భవనంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారని పోలీసులు చెప్పారు.
ఈ సంఘటన నార్తర్న్ స్విట్జర్లాండ్‌లోని నగరంలో జరిగాయి. వెరన్లింగన్ నగరంలో స్థానికంగా ఉంటున్న పలువురు కాల్పులను విన్నారు. ఈ సంఘటన శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు.

సంఘటన ప్రాంతానికి వెళ్లిన తమకు పలు మృతదేహాలు కనిపించాయని చెప్పారు. రెసిడెన్షియల్ ప్రాంతంలో కొందరు రక్తపు మడుగుల్లో కనిపించారని చెప్పారు. మృతి చెందిన వారంతా యుక్తవయస్కులేనని చెప్పారు. చనిపోయిన వారు ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నేరస్తులు ఎవరో తెలుసుకోవాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications