ఆమె సూట్ కేసును తెరిచిన పోలీసులకు షాక్..
బ్రెజిల్ : అందరూ ప్రయాణికుల్లాగే లగేజీతో రైల్వే స్టేషన్ కు చేరుకుంది ఓ మహిళ. అయితే ఆమె తీసుకొచ్చిన లగేజీ భారీగా ఉండడం.. వ్యవహారం కూడా కాస్త అనుమానస్పదంగా కనిపించడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు విషయంపై ఆరా తీశారు. తీరా.. లగేజీ బ్యాగ్ ఓపెన్ చేశాక.. ఆ తర్వాత సీన్ కు పోలీసులే షాకయ్యారు.
అసలు విషయమేంటంటే.. నాటాషా విటోరియానో సౌటో (23) అనే యువతికి రోడ్డు మీద వెళుతుండగా.. 11ఏళ్ల బాలుడు ధీనంగా తనకు ఎదురుపడ్డాడు. తన తల్లిదండ్రులిద్దరు డ్రగ్స్ కు బానిసలుగా మారి తనను వేధిస్తున్నారని.. తనను దత్తత తీసుకుని వెంట తీసుకెళ్లాల్సిందిగా మహిళతో ప్రాధేయపడ్డాడు బాలుడు. బాలుడి పరిస్థితికి చలించిపోయిన నటాషా అతన్ని తన వెంట తీసుకెళ్లేందుకు సిద్దమైంది.

అయితే నేరుగా బాలుడిని తమ దేశానికి తీసుకెళ్లడం కష్టం కాబట్టి.. అధికారుల కళ్లు గప్పి బాలుడిని తీసుకెళ్లాలని చూసింది. ఇందుకోసం ఆ బాలుడిని దుప్పటిలో జాగ్రత్తగా చుట్టి.. అనంతరం లగేజీ బ్యాగులో కుక్కేసి రైల్వే స్టేషన్ కు బయలుదేరింది. స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతుండడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు విషయంపై ఆరా తీశారు. దీంతో లగేజీ బ్యాగులో బాలుడిని దాచిన విషయం బయటపడింది.
అనంతరం బాలుడిని సంరక్షణ కేంద్రానికి తరలించగా.. యువతిపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు పోలీసులు. ఇదిలా ఉంటే మహిళను పోలీసులు సోదా చేసిన రైల్వే స్టేషన్ రియో ఒలింపిక్స్ జరగబోయే ప్రాంతానికి 550 మైళ్ల దూరంలోనే ఉండడం గమనార్హం.












Click it and Unblock the Notifications