పోలీసులకే మస్కా కొట్టి దొరికిపోయిన కవలలు
మాస్కో: ఆ ఇద్దరు కవలలు ఒకేలా ఉంటారు. దీన్నే ఆసరాగా చేసుకుని తమ పని కానిద్దామని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు వారి ఆలోచన బెడసికొట్టి జైలుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన రష్యాలోని మాస్కోలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యారోస్లావ్, ఓలెగ్(20)లు మాస్కోకు చెందిన కవల అన్నదమ్ములు. అయితే, పెద్దవాడైన యారోస్లావ్ మాస్కోలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఓ రోజు యారోస్లావ్ ఏదో పని ఉండి విధులకు వెళ్లలేకపోయాడు.
అప్పుడే యారోస్లావ్‌కి తన స్థానంలో తమ్ముడు ఓలెగ్ స్పీవక్‌ని పంపాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా తన తమ్ముడిని తన విధుల్లోకి పంపించాడు.

దాదాపు ఏడాది వరకు అక్కడి పోలీసులు కూడా ఎవరు అసలైన పోలీసో తెలుసుకోలేకపోయారు. అయితే, ఓసారి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఓ కేసు విషయమై ఓలేగ్‌తో మాట్లాడాడు. ఆ అధికారి ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో ఓలేగ్‌కి అర్ధం కాకపోవడంతో.. విధిలేని పరిస్థితుల్లో దొరికిపోయాడు.
దీనిపై విచారణ చేపట్టగా తన అన్న డ్యూటీలో లేనప్పుడు తాను వస్తుంటానని నిజం ఒప్పుకున్నాడు. తన అన్నే విధుల్లో ఎలా ఉండాలో కూడా నేర్పించాడని చెప్పాడు. దీంతో పోలీసులనే మోసం చేయాలని చూసిన యారోస్లావ్‌ని ఉద్యోగంలోంచి తొలంగించి అరెస్ట్ చేశారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications