ట్రంప్ ఎఫెక్ట్, ఇదీ కిమ్ జాంగ్ వ్యూహం: ప్లాన్ వెల్లడించిన ప్రొఫెసర్
ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ భయానికి కారణం ఉందని అమెరికాలోని టెరెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొలిన్ అలెగ్జాండర్ చెబుతున్నారు. వర్సిటీలో ఆయన రాజకీయ, సమాచార శాస్త్రాన్ని బోధిస్తారు.
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ భయానికి కారణం ఉందని అమెరికాలోని ట్రెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొలిన్ అలెగ్జాండర్ చెబుతున్నారు. వర్సిటీలో ఆయన రాజకీయ, సమాచార శాస్త్రాన్ని బోధిస్తారు.

తెల్లారితే యుద్ధం అనేలా
తెల్లవారితే చాలు, యుద్ధం మొదలు అన్నరీతిలో అమెరికా, ఉత్తర కొరియాలు స్పందిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ రెండు దేశాల అధ్యక్షుల కోరిక ఒకటేనని ఆయన చెప్పారు. అందుకే ప్రతిరోజు యుద్ధం మొదలు పెట్టేరీతిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారన్నారు.

దేశాన్ని నాశనం చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు
ఉత్తర కొరియా అణ్వాయుధాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఉత్తర కొరియాపై దాడి చేస్తాం, ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తాం, ఆ దేశాన్ని తేలిగ్గా తుడిచేస్తామని ట్రంప్ అంటుంటే ఏ దేశ అధ్యక్షుడైనా ఏం చేస్తాడని ప్రశ్నించారు.

అదే కిమ్ ఆందోళన
కిమ్ తన దేశం గురించి ఆందోళన చెందుతున్నారని సదరు ప్రొఫెసర్ అన్నారు. గతంలో అమెరికా దాడులు చేసిన ఇరాక్, లిబియాల పరిస్థితిని ఆయన గుర్తు చేశారు. ఇరాక్‌పై అమెరికా దాడికి దిగకముందు ఆ దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేవని, ఇప్పుడు ఆ దేశం పరిస్థితి ఎలా అయిందో గుర్తుంచుకోవాలన్నారు.

అందుకే కిమ్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు
లిబియాలో గడాఫీ ఉన్నప్పుడు ఆందోళనలు ఉన్నప్పటికి, ఇప్పటికి తేడా చూడాలని సదరు ప్రొఫెసర్ సూచించారు. ఈ రెండు దేశాల పరిస్థితి చూశాక ఎప్పుడో ఒకప్పుడు తనకు కూడా అదే గతి పడుతుందేమోననే కిమ్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆ భయంతోనే అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నాడన్నారు.

అక్కడి వరకు ఓకే, కానీ
అలా చేసుకోవడం వరకు మంచిదే కానీ, వాటితో అమెరికాలోని ప్రధాన నగరాలను నాశనం చేస్తానని ప్రకటించడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications