‘అధ్యక్షుడిగా ట్రంప్’పై సర్వే: ‘యుద్ధమే’ అంటూ ప్రజల వ్యతిరేకత!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ఆ దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా 'ఎన్‌బీసీ', 'సర్వేమంకీ' నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం బయటపడింది.

ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని 53 శాతం మంది పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆయన పాలనతో ఇబ్బందులు తప్పవని ప్రజలు తమ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే నాలుగేళ్లలో అమెరికా ఓ పెద్ద యుద్ధంలో పాల్గొనాల్సి రావొచ్చంటూ మూడింట రెండొంతుల మంది ప్రజలు భావిస్తున్నట్టు సర్వే పేర్కొంది.

Poll: More Than Half Disapprove of Donald Trump’s Job Performance

30 శాతం మంది మాత్రం ట్రంప్ పాలనపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కాలేజీ యువత కూడా అత్యధికంగా ట్రంప్‌ను వ్యతిరేకించడం గమనార్హం. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించడాన్ని మాత్రం 50 శాతం మంది సమర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+