ఉత్తరకొరియా 'పండగ' చేసుకుంది: క్షిపణి 'సక్సెస్'తో పార్టీ మూడ్‌లో కిమ్
ఖండాంతర క్షిపణుల విజయంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ గాల్లో తేలిపోతున్నారు. దాని తయారీ వెనుక కృషి చేసిన వారందరికీ ఇటీవలే ఓ పెద్ద పార్టీ కూడా ఇచ్చారట.
టోక్యో: ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తుంటే.. ఆ దేశాధ్యక్షుడు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. తాజాగా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉత్తరకొరియా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం.. అది విజయవంతమవడం తెలిసిందే.
ఖండాంతర క్షిపణుల విజయంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ గాల్లో తేలిపోతున్నారు. దాని తయారీ వెనుక కృషి చేసిన వారందరికీ ఇటీవలే ఓ పెద్ద పార్టీ కూడా ఇచ్చారట. పాప్ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ పార్టీకి హాజరైనవారు డ్యాన్సులు కూడా చేసినట్లు చెబుతున్నారు.

ఉత్తరకొరియా సెంట్రల్ ఏజెన్సీ న్యూస్ ఈ కథనాన్ని వెలువరించింది. అంతేకాదు, క్షిపణి ప్రయోగాన్ని ఆ దేశం జాతి విజయంగా భావిస్తుందంటూ అక్కడి మీడియా పేర్కొనడం గమనార్హం. పాప్ మ్యూజిక్ లో భాగంగా.. కన్సర్ట్ లో సాంగ్ ఆఫ్ హ్వాసంగ్ రాకెట్, మేక్ అదర్స్ ఎన్వీ అజ్ అనే గీతాలను కూడా ప్లే చేసినట్లు తెలిపింది.
కన్సర్ట్ లో డ్యాన్స్ చేసేందుక ప్రత్యకంగా మహిళల బ్యాండ్ ను సైతం కిమ్ జాంగ్ ఎంపిక చేశారట. గతంలో ఎన్నడూ లేనివిధంగా కిమ్ జాంగ్ ఇలా పార్టీ ఇవ్వడంపై ఆ దేశంలో చర్చ జరుగుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications