అత్యంత విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం.. హైఫ్లో ఆక్సిజన్ తో చికిత్స
ప్రముఖ క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం మరింత విషమించినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 88 ఏళ్లు. ఈ నెల 14వ తేదీన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు పోప్ ఫ్రాన్సిస్. అయితే శ్వాస తీసుకోవడంలో శనివారం నాడు మరింతగా ఇబ్బంది పడ్డారని.. దీంతో హైఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు.
ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు రక్తాన్ని కూడా మార్మని స్పష్టం చేశారు. పోప్ న్యూమోనియాతో పాటు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరో వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదం నుంచి పోప్ ఇంకా బయటపడలేదని ఆయన వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్బొన్ తెలిపారు.

అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. కాగా దక్షిణార్థ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. ఈ సమయంలో ఏమీ చెప్పలేమని వాటికన్ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.












Click it and Unblock the Notifications