ఇదేం గోకుడు?: ట్రంప్ చేతిని విసిరికొట్టిన పోప్(వీడియో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో అమెరికా అధ్యక్షుడు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు నవ్వుకుంటూనే విరుచుకుపడుతున్నారు.
రోమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో అమెరికా అధ్యక్షుడు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు నవ్వుకుంటూనే విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్ పర్యటన నుంచి రోమ్ చేరుకున్న ట్రంప్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అదేమంటే.. పోప్‌ను కలుసుకున్న ట్రంప్ దంపతులు పొటో దిగుతుండగా.. పోప్ చేయిని ట్రంప్ పట్టుకునే ప్రయత్నం చేశారు. మొదట చిన్నపిల్లాడిలా పోప్ చేతిపై చిటికెన వేలితో గోకి చేతిని అందుకోబోయారు.
వెంటనే.. పోప్ ఒక్క పెట్టున ట్రంప్ చేతిని విసిరికొట్టారు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో వైరల్ అయింది. చూసిన నెటిజన్లు నవ్వు ఆపులేకపోతున్నారు. అయితే, ఇది ఫేక్ వీడియో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవల ఇజ్రాయెల్‌లో సతీమణి మెలానియాకి చేయి అందిస్తే ప్రయత్నం చేయగా ఆమె కూడా ట్రంప్ చేయిని దూరంగా తోసేయడం తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications