పదే పదే పోర్న్ చూస్తున్నారా..! అయితే మీరు ఇలాగే..

వ్యసనమేదైనా దానికో చెడు పర్యవసానం తప్పకుండా ఉంటుంది. శృతిమించి పోయే ఏ చర్యలకైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. సిగరెట్, గుట్కా, తరహాలోనే ఆధునిక ప్రపంచంలో తన పరిధిని మరింత విస్తరించుకున్న 'పోర్న్ వ్యవస్థ' చాలామంది మెదళ్లను తుప్పుబట్టిస్తోంది.

తాజాగా పోర్న్ సినిమాలకు బానిసైనా వారి మీద దాని దుష్పరిణామాలు ఎలా ఉంటున్నాయన్న దానిమీద ఆసక్తికర విషయాలను పరిశోధకులు బయటపెట్టారు. తరుచూ పోర్న్ సినిమాలు చూసేవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోందంటున్నారు పరిశోధకులు.

PORN RESEARCH SHOWS A CONNECTION BETWEEN PORN AND BRAIN STRUCTURE

జేఏఎమ్‌ఏ సైకియాట్రి అనే సంస్థ పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడైనట్టుగా సమాచారం. నిత్యం పోర్న్ చూసేవాళ్ల మెదళ్లపై దీర్ఘకాలంలో దాని ప్రభావం ఉంటుందని, తద్వారా మెదడు బ్లాంక్ అయిపోయే స్థితికి కూడా చేరుకుంటారని పేర్కొంది.

ఇక పోర్న్ ఎక్కువగా చూసేవారు నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు మాత్రం సెక్స్ విషయంలో అంతగా ఆసక్తి కనబర్చకపోవడం, లైంగిక సామర్థ్యం తగ్గిపోయి దాంపత్య జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం వంటి ప్రభావాలకు లోనవుతారని సంస్థ నివేదిక వెల్లడించింది. అలాంటి వ్యక్తుల్లో హార్మోన్లు కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+