పుతిన్‌కు పోటీగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి పోర్న్ స్టార్!

ఓ మాజీ రష్యన్ పోర్న్ స్టార్ వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

మాస్కో: ఓ మాజీ రష్యన్ పోర్న్ స్టార్ వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వాయువ్య రష్యాలోని ముర్మానస్క్‌కు చెందిన ఎలీనా బెర్కోవా ఈ సంచలన ప్రకటన చేశారు.

సోచి మేయర్‌గా కూడా పోటీ చేసిన ఆమె.. సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఎలీనా(32).. అధ్యక్ష పదవికి పోటీ చేసే నాలుగో మహిళగా రికార్డులకెక్కనున్నారు.

Porn star announces she will stand against Putin in upcoming Russian elections

లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. మగవాళ్లు వీడాకులు ఇచ్చే అర్హత లేకుండా చేస్తానని, పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తామని చెప్పారు.

అంతేగాక, 40సెం.మీల కంటే ఎక్కువగా ఉండే స్కర్టులు ధరిస్తే నేరంగా పరిగణిస్తామని చెప్పారు. కాగా, ఆమెను ఫాలో అవుతున్న 6,39,000మంది ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హార్వే వీన్‌స్టీన్ లైంగిక వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో బెర్కోవా ఇలాంటి ప్రకటనలు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+