Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోర్న్ యాక్టర్‌తో ట్రంప్ బేరసారాలు! తనతో గడిపేందుకు.. హోటల్ కు రావాలన్నాడు

లాస్ ఏంజెల్స్ : మహిళలపై లైంగిక పరమైన కామెంట్స్ తో ఇప్పటికే కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు అమెరికన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్. మహిళల పట్ల గతంలో ఆయన చేసిన చవకబారు కామెంట్స్ అన్నీ ఇప్పుడు తెరమీదకు వచ్చి.. ఆయన పొలిటికల్ ఇమేజీని తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి. ఈ ఆరోపణల పరంపరలో మరో తాజా వ్యవహారం కూడా వార్తల్లోకి ఎక్కింది.

శృంగార తార జెసికా డ్రాకే (42).. ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన హోటల్ రూమ్ కు రావాల్సిందిగా తనను డిమాండ్ చేసిన ట్రంప్.. తనతో ఏకాంతంగా గడిపేందుకు గాను 10వేల డాలర్లు ఆఫర్ చేశారని డ్రాకే ఆరోపించారు. అప్పటికే ట్రంప్ ఆఫర్ ను తాను తిరస్కరించినప్పటికీ తన పీఏను పంపించి తనతో బేరసారాలకు దిగినట్లుగా డ్రాకే తెలిపింది.

2006లో కాలిఫోర్నియాలోని లేక్ టాహోయ్ గోల్ఫ్ టోర్నమెంట్ లో తొలిసారిగా ట్రంప్ ను కలుసుకున్నానని చెప్పిన డాక్రే.. ఆయన ఆహ్వానం మేరకు హోటల్ గదికి వెళ్లామని చెప్పింది. అయితే ఒక్కదానినే వెళ్లడం మంచిది కాదని, మరో ఇద్దరు మహిళలను కూడా వెంట తీసుకెళ్లినట్లుగా చెప్పింది. తీరా అక్కడికెళ్లాక.. తమను గట్టిగా కౌగిలించుకోవడంతో పాటు తమ అనుమతి లేకుండానే ముద్దు పెట్టుకున్నట్లు డాక్రే ఆరోపించింది. పోర్నోగ్రఫీ గురించి కూడా తమతో చర్చించిన ట్రంప్.. అక్కడినుంచి తిరిగొచ్చాక మరోసారి తన హోటల్ గదికి రావాల్సిందిగా మరోసారి ఆహ్వానం పంపించారని డాక్రే వివరించింది.

Jessica Drake

తనతో పార్టీకి రావడానికి.. ఎంత కావాలో.. ఏం కావాలో చెప్పాలంటూ ట్రంప్ బేరసారాలకు దిగినట్లుగా డాక్రే చెప్పుకొచ్చారు. తన ఆఫర్ కు ఓకె చెబితే.. ట్రంప్ వ్యక్తిగత విమానం ద్వారా లాస్ ఏంజెల్స్ తీసుకెళ్తామని ట్రంప్ తనను ప్రలోభ పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఈ విషయాలన్నింటిని వెల్లడించింది జెసికా డాక్రే. ఈ ప్రెస్ మీట్లో తనతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా పాల్గొన్నారు.

ఇక యథావిధిగా ఈ ఆరోపణలన్నింటిని ఖండించింది ట్రంప్ ప్రచార బృందం. ఆరోపణల వెనుక హిల్లరీ హస్తముందని, ఇదంతా కావాలని బురదజల్లే ప్రయత్నమేనని ఆరోపణలను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది ట్రంప్ వర్గం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+