ఇంట్లోకి రానివ్వడం లేదు: పేరెంట్స్‌పై పోర్న్ స్టార్ ఫిర్యాదు

మాస్కో: తన తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానీయడం లేదని, కొడ్తున్నారని రష్యా పోర్న్ స్టార్ వ్లాదిస్లావా జాత్యగాలోవా(20) పోలీసులను ఆశ్రయించింది. తాను ఎంచుకున్న వృత్తి గురించి తెలియడంతో తనను వారు కూతురిగా అంగీకరించడం లేదని ఫిర్యాదు చేసింది.

కొరియోగ్రాఫర్ అవుతుందనుకున్న తమ కూతురు పోర్న్ స్టార్‌గా తిరిగిరావడంతో వ్లాదిస్లావా జాత్యగలోవా తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానీయలేదు. తలుపులకు తాళాలు వేసుకున్నారు. ఇంట్లో ఉన్న తన వస్తువులు తీసుకెళ్లడానికి కూడా అనుమతించలేదని వ్లాదిస్లావా ఫిర్యాదులో పేర్కొంది. గతంలో తల్లిదండ్రులు తనను హింసించారని కూడా ఆరోపించింది.

తనను భౌతికంగా, మానసికంగా హింసించారని వాపోయింది. 20 ఏళ్ల వ్లాదిస్లావా.. సోఫీ గోల్డ్ ఫింగర్ పేరుతో పలు పోర్న్ చిత్రాల్లో నటించింది. కాగా, తన తల్లిదండ్రులు సంకుచితంగా ఆలోచిస్తున్నారని ఆమె మండిపడుతోంది.

Porn star sues her Russian parents after they changed the locks at their home when they found out about her career

పోర్న్ చిత్రాల్లో నటిస్తున్నాననే కారణంతో తనను ఇంట్లోకి రానీయపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమాజంలో పరువు ప్రతిష్ఠలు పోతాయనే భయంతో కూతురుగా అంగీకరించేందుకు తన తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పింది.

కాగా, వ్లాదిస్లావాతో మాట్లాడేందుకు కూడా ఆమె తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. లాయర్ ఆండ్రీ
టెమ్నికోవ్ ద్వారా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమపై చేసిన ఆరోపణలపై దావా వేస్తామని ఆమెను వ్లాదిస్లావా తల్లిదండ్రులు హెచ్చరించారని స్థానిక మీడియా కథనాల్లో వెలువడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+