వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Youtube నుంచి ఆ ఛానెల్ తొలగింపు..ఆ వీడియోలు ఇక కనిపించవ్..!

|
Google Oneindia TeluguNews

రసిక శిఖామణులకు బ్యాడ్ న్యూస్. ప్రముఖ వీడియోస్ సంస్థ యూట్యూబ్ పోర్న్ హబ్ ఛానెల్‌ను తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. పోర్న్ హబ్ హద్దులు మీరడమే కాకుండా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను సైతం పదేపదే విస్మరిస్తోందని యూట్యూబ్ పేర్కొంది. సాధారణంగా యూట్యూబ్‌పై నగ్నత్వంచ పోర్నోగ్రఫీ వంటి వీడియోలను నిషేధం. అయితే పోర్న్ హబ్ మాత్రం క్రియేటివ్ కంటెంట్ పేరుతో న్యూడిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తుండటాన్ని యూట్యూబ్ తప్పుపట్టింది.

"కమ్యూనిటీ గైడ్‌‌లైన్స్‌ను పలుమార్లు ఉల్లంఘించడంతో పోర్న్‌హబ్ ఛానెల్‌ పై వేటు వేశాము. మా విధానాలు అందరికీ అన్ని ఛానెల్స్‌కు ఒకేలా అమలు చేస్తాము. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘించే వారెవరైనా సరే అలాంటి ఛానెల్స్‌ను నిషేధించడం జరుగుతుంది. " అని యూట్యూబ్ ప్రతినిధి జాక్ మలోన్ పేర్కొన్నారు.

Youtube removes pornhub for violating community guidelines.

ఇదిలా ఉంటే పోర్న్ హబ్‌కు దాదాపుగా 9లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. ఇక అడల్ట్ కంటెంట్ ఎక్కువగా కనిపించే పోర్న్ హబ్‌లో సబ్‌స్క్రైబర్లు 18 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారు. దీన్ని యూట్యూబ్ చాలా తీవ్రంగా పరిగణించింది. అయితే తాము యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఎక్కడా ఉల్లంఘించలేదని, తమనే వేరు చేసి చూస్తున్నారని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని పోర్న్ హబ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. సోషల్ మీడియా గైడ్‌లైన్స్ పేరుతో ఇలా ఒకరిని టార్గెట్ చేసి దెబ్బతీయం సరికాదన్నారు.

Youtube removes pornhub for violating community guidelines.

ఇదిలా ఉంటే పోర్న్‌హబ్‌ను తొలగించిన సోషల్ మీడియా సైట్స్‌లో యూట్యూబ్ ఒక్కటే కాదు.. అంతకుముందు కొన్ని నెలల క్రితం ఇన్స్‌టాగ్రామ్ కూడా పోర్న్‌హబ్‌పై శాశ్వతంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్, సెక్స్ కంటెంట్, నగ్నత్వాలు పోర్న్‌హబ్ ప్రమోట్ చేస్తున్నందున ఆ వీడియో సైట్‌ను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ఇన్స్‌టాగ్రామ్ వెల్లడించింది. పోర్న్ హబ్‌ పై తీసుకున్న ఈ నిర్ణయంపై వివరణ ఇవ్వాలంటూ పోర్న్ హబ్ డిమాండ్ చేసింది. తమ ఛానెల్ ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలని ప్రశ్నించింది. పోర్న్ హబ్‌పై కంటెంట్ క్రియేటర్ల జీవనోపాధిని ఇన్స్‌టాగ్రామ్ దెబ్బతీసిందని ఆ ఛానెల్ ప్రతినిధి ఒకరు ఆరోపించారు. తమ బ్రాండ్‌లను, బిజినెస్ విస్తరించుకునే క్రమంలో ఇలా వివక్షాపూరితంగా ప్రవర్తించి దెబ్బతీయడం మంచిది కాదని పేర్కొంది. తమ జీవానోపాధిపై దెబ్బతీస్తున్నారని పోర్న్‌హబ్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary
Youtube removes pornhub for violating community guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X