వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిలిప్పిన్స్‌ బిల్ బోర్డు‌లో ఫోర్న్ వీడియో భారీగా ట్రాఫిక్ జామ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

మనీలా: పిలిప్పీన్స్‌లోని హైవే పక్కనే ఉన్న బిల్ బోర్డులో ఫోర్న్ వీడియో అరక్షణం పాటు ప్రసారమైంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే నగర మేయర్ ఫోర్న్ చిత్రాన్ని నిలిపివేశారు.

ఫిలిప్ఫిన్స్‌లోని మకాటి నగరంలో రద్దీగా ఉన్న రోడ్డు పక్కనే ఉన్న బిల్‌బోర్డులో హఠాత్తుగా ఫోర్న్ వీడియో ప్రసారమైంది. ఈ ఫోర్న్ వీడియోను చూసేందుకు వాహనదారులు రోడ్డుపైనే వాహనాలను నిలిపివేశారు. కేవలం అర నిమిషం పాటే ఈ వీడియో ప్రసారమైంది.

Pornographic video accidentally plays on highway in Philippines

అర నిమిషం వరకే ఈ వీడియో ప్రసారం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిల్ బోర్డులో ఫోర్న్ వీడియో ప్రసారమౌతున్న విషయాన్ని నగర మేయర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆయన బిల్ బోర్డులో ఫోర్న్ వీడియోను నిలిపివేశారు.

అయితే బిల్ బోర్డులో ప్రసారమైన అశ్లీల వీడియోలను వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు మకాటి మేయర్ ప్రకటించారు. ఈ ఘటన అనుకోకుండా చోటు చేసుకొందన్నారు. బిల్ బోర్డు యజమాని పేరును,ఆపరేటర్, ఉద్యోగులను బాధ్యులుగా చేర్చినట్టుగా మకాటి మేయర్ చెప్పారు. పిలిఫ్పిన్స్‌లో ఫోర్నోగ్రఫీ నేరం. సినిమాల్లో, టీవిల్లో ఫోర్న్ దృశ్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటారు.కానీ, బహిరంగ ప్రదేశాల్లో ఈ రకమైన వీడియోలు ప్రదర్శించడం కలకలం రేపుతోంది.

English summary
The mayor of the major financial hub in the Philippines said on Wednesday she was investigating after a pornographic video appeared briefly on a prominent billboard, startling motorists on one of the bustling city's major roadways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X